Tuesday, September 22, 2009

నేను ఒక సగటు భారతీయుడిని

నేను ఒక సగటు భారతీయున్ని
ఎల్లప్పుడూ నా దేశం గొప్పదని బ్రతుకుతుంటాను
కాని నా దేశాన్ని ఇంకొంచెం గొప్పదాన్ని చెయ్యాలని ఆలోచించను

ఒక్క ఓటుకు రేట్ నేను నిర్ణయిస్తాను, అరే డబ్బు తీసుకుంటే ఆ తరువాత నా జీవిత రేటును వారు నిర్ణయిస్తారని నేను ఆలోచించను
ఇదు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఈ dourbhgyaniki కారకులెవరో ఆలోచించను

రోడ్లు బాగాలేకపోతే ప్రభుత్వాన్ని తిడుతాను
హాస్పిటళ్ళు బాగాలేకపోతే ప్రభుత్వాన్ని తిడుతాను
ఇదంతా నా కుసంస్కారం వల్ల జరుగుతోందని ఎప్పడికీ ఆలోచించను
ఇదంతా నేను తీసుకున్న డబ్బుకి మరో విధంగా జమ అవుతోన్న పద్దతి అని ఆలోచించను


నాకు జీవితములో ఎన్ని ఉచితంగా దొరికితే అంత సంతోషం
బియ్యం వుచితం
కరంటు వుచితం
భూమి వుచితం
నీరు వుచితం
చార్జీలు వుచితము
నేను బాగా చదువకపోయినా....నేను ధనవంతున్ని అయినా.. నా పేరు వాడుకొని కాలేజిలు స్కాలర్షిప్ తిన్తున్నాయని తెలిసినా...నేను ఆలోచించను...
ఆ డబ్బు వల్ల ఇంకో పేదవాడికి చదువు దొరుకుందని తెలిసినా పట్టించుకోను


టీవీ ఛానల్ రిపోర్టర్ నా మీద ఫోకస్ చేస్తున్నాడని తెలిసిందా.. ఇక సరే సరి..మరింత వుత్సాహంగా...గలాటా ఎక్కువ చేస్తాను....దారిన పోతున్న ఒక వ్యక్తి బైకును కాల్చేందుకు.. ప్రయత్నిస్తాను ...
పలాని గుండా నాకు దగ్గర బంధువని ... నాకు క్లోజ్ ఫ్రెండ్ అని..చెప్పుకోవడానికి గర్వపడుతాను...

మంచి వారికీ వోటు వెయ్యమని ఎవరన్న చెప్పితే , ప్రజాకర్షణ లేదంటారు
అంటే ప్రజలకి ప్రజకర్శనే ముఖ్యం. వాడు ఎలాంటివాడు ఆయినా సరే ..
అందుకే మన్మోహన్ సింగ్ లాంటి వాడు లోక్సభ ఎన్నికలలో గెలవ లేక పోయాడు.
అందుకే మన నాయకులు ప్రజకర్షణకు కష్టపడ్డట్టు ప్రజాసేవకు ఇష్టపడటం లేదు..
చివరకు రాఖీ సావంత్ లాంటి వారు పార్లమెంటులో అడుగు పెట్టిన ఆశ్చర్య పోనవసరం లేదు..ఎందుకంటే ఆమెకు వున్నా ప్రజాకర్షణ అల్లాంటిది
ఇది మనము నేర్పిన విద్యే ...మరియు మనము నేర్పుతున్న విద్యే

నేను మారనని నాకు తెలుసు.. అంతే కాదండోయ్ ...
నేను మారనని నాతో పాటి అందరికీ తెలుసు.......

జీవితములో అన్ని అడ్డ దారిలోనే రావాలని ఆలోచిస్తుంటాను
తరువాత దేశాన్ని తిడుతాను
పరాయి వారు ఎవరన్న నా దేశాన్ని తిడుతోంటే నా దేశము గొప్పదని , గొప్ప చరిత్ర గలదని ... అందుకు వుదహరనలుగా ఆర్యభట్ట , వరహమిహురుడు, అశోకుడు, బుద్దుడు అని రెండు వేళ సంవత్సరాల ముందు పుట్టిన గొప్పవారి పేర్లు చెపుతూ వుంటాను
సున్నా కనుక్కున్నది మేమే అని
లేదంటే.. పరమహంస, గాంధీ ల పేర్లు ఉదహరిస్తాను..


నాకు అయితే గాంధి మళ్ళీ పుట్టినా నా దేశం మారదని అనిపిస్తోంది.. ఆలోచించాలి... ఆలోచించాలి.. ఆలోచించాలి.. ఎవరో పుట్టితే దేశము మారదని.. మనకు మంచి బుద్ధి పుట్టాలని...ఆలోచించాలి

శ్రీ శ్రీ గారు ఎప్పుడో చెప్పినట్టు.. మనదీ ఒక బతుకేనా కుక్కలవలె నక్కలవలె.. సందులలో పందులవలె..
అంతే కాకుండా శ్రీ శ్రీ గారు మరో మాట చెప్పారు..
పదండి ముందుకు ...పదండి ముందుకు.. మరో ప్రపంచం నిర్మిద్దాం... అని