మనలో చాలా మంది ఉక్రెయిన్ యుద్ధం ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి , ఆ యుద్ధం యొక్క ప్రభావం మన మీద ఉండదు అనే అభిప్రాయం లో ఉన్నారు..
టీవీల వ్యాఖ్యాతలు యుద్దాన్ని ఒక నాటకీయంగా, థ్రిల్లర్ సినిమాలో లాగా చూపించడంతో మనకు ఎక్కువ వినోదభరితమే కనపడుతోంది ఈ యుద్ధం వల్ల మనందరి జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని తెలిపేటందుకు తక్కువ సమయం కేటాయిస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ పఠాన్ని, ప్రపంచ గమనాన్ని, దేశాల ఆలోచనా విధానాల్ని మార్చబోతోంది అనేది నా అభిప్రాయం.