మనకు స్వతంత్రం 1947 లో వచ్చింది అని మన అందరికీ తెలుసు..
ఎందరో మహానుభావుల కృషి మరియు త్యాగాల పలితం మనకు దక్కిన ఈ స్వాతంత్ర్య ఫలం..
ఈ స్వాతంత్ర సంగ్రామంలో... ఈ మహానుభావులతోపాటు ... తన వంతు పాత్రను పోషించాయి.. అప్పటి.. విజ్ఞాన , వినోద సాధనాలు అయిన.. పత్రిక మరియు నాటక రంగాలు..
మానవ విజ్ఞాన అభివృద్ధి ద్వారా.. మనం సృష్టించిన సినిమా మరియు టీవి రంగాలను కూడా ఇందులో చేర్చాము.
ఒకరి భావాన్ని ... పది మందికీ తెలియజెప్పే.. ఈ సాధనాల శక్తి గ్రహించే.. బాపు లాంటి వాళ్ళు కూడా "హరిజన్" , "నవజీవన్" అనే పత్రికలలో విలేఖరి గాను, ఎడిటర్ గాను పని చేసి.. దాని ద్వారా.. స్వతంత్ర భావాలని.. సాటి భారతీయులలో పెంపొందిన్చగలిగాడు .
మరి ఇప్పుడు.. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన దుస్థితి చూస్తే.. మనందరికీ జాలి కలగకమానదు..
ఏ పత్రికను చూసినా.. ఏదో ఒక రాజకీయ పార్టీకి సంభందించిన కరపత్రిక అన్నట్టు తయారు అయ్యిందా అన్న సంశయం మనకు కలుగకమానదు..
ఈ గజిబిజి ఆటలో.. ఏ పత్రిక రాసిన వార్తలో.. ఎంత నిజం వుందో.. గ్రహించడానికి... సాటి పత్రికాపాటకుడు ..
తికమకపడిపోతున్నాడు...అన్న మాట వాస్తవం ..
పది, పదిహేను సంవత్సరాల ముందు.. ఈనాడు పత్రికను ఐఏఎస్ కు చదివే విద్యార్థులకు.. రెకమెన్డేడ్ (Recommended) పత్రిక.. ఎందుకంటే.. అప్పడు..ఆ పత్రికలో దేశ, విదేశ, రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల గురించి.. విపులంగా వివరించే వారు..
మరి ఇప్పుడు.. ఆ పత్రిక చూస్తే.. రాజకీయాలు తప్ప వేరే వార్త కనిపించడం లేదు..
ఇలాంటి సంఘటనలవల్ల .. మన తెలుగు వారికి.. ఆంగ్ల పత్రికలను ఆశ్రయించే పరిస్థితి దాపురించిది..
మీరే చెప్పండి.. మన అందరి కుటుంబాలలో.. ఎన్ని కుటుంబాలు ఆంగ్ల పత్రిక మాత్రమే తెప్పిస్తున్నాము..
ఆంగ్లములో పర్లేదు అనిపించే పట్టు వుంటే చాలు .. చాలా మంది ఆంగ్ల పత్రికలనే ఆశ్రఇస్తున్నారు..
ఆసలే తెలుగు భాషకు... చదలు పట్టేసింది..
ఒకప్పుడు తెలుగు రాసే వారు తక్కువ వుండేవారు
తరువాత చదివే వారు తగ్గారు
ఇప్పుడు మాట్లాడేవారూ .. తగ్గుతున్నారు..
ఇప్పడికే మనము చాలా మందిని చూస్తుంటాము.. నాకు తెలుగు మాట్లాడడం వచ్చు.. కాని చదవడం రాదు అని.. కాని వారు ఆంగ్ల నవలలు చదువుతారు.. పెద్ద చదువులు ఆంధ్ర రాష్ట్రములోనే చదివింటారు...
ఈ విషయంలో తప్పు వారిని కాదని నేను అనుకుంటాను ..
ఒక హోటల్లో మంచి రుచుల వంటలు లేకపోతే .. ఆ హోటలుకు ఎవరూ వెళ్ళరు .. హోటల్ లాంటిదే భాష కూడా ..మంచి రుచి లేక.. రుచి వున్న భాషను ఆశ్రయిస్తారు ...
ఈమధ్య వచ్చిన "జల్సా" అనే సినిమాలో ఒక లైన్ వుంది .. "అదే మన తెలుగులో అంటే.. "DONT WORRY BE HAPPY " .. నేను అది విని.. పగలబడి నవ్వాను .. పాటల రచయితలకు తెలుగు ఏదో .. కాదో తెలియనంత భ్రమలో మనల్ని మున్చుతున్నారేమో అనిపించింది ... పాటకులు నన్ను క్షమించాలి .. నేను తప్పుగా అర్థం చేసుకునివుంటే .....
ఇలా ఉన్నప్పుడు ..
ఇక ఈ వినోద సాధనాలు కూడా... మనలో ఆ రుచినీ అంటే ఉత్సుకతను తీసుకు రాకపోతే... తెలుగు భాషకు.. అంతం మరింత దగ్గర పడ్డట్టే..
చెబుతే.. నవ్వు వస్తుంది కాని.. అంతో ఇంతో తెలుగువారు తెలుగు భాష చానల్స్ చూస్తున్నారంటే.. సీరియల్సు అనగా ధారావాహికల పాత్రను మెచ్చుకోవలిసిందే.. :)
ఎందుకంటే.. వార్త ఛానల్ లు.. కూడా రాజకీయ పార్టీల భావాలనే.. ప్రతిబింబిస్తున్నాయి..
ఒకసారి అబ్దుల్ కలాం భారతీయ మీడియా గురించి చెపుతూ.. మన పత్రికలూ
ఎప్పుడు చెడు సంఘటనలే ఎందుకు ముందర పేజిలో వేస్తారు... ఒకసారి ఆయన ఇజ్రాయెల్లో
ఉన్నప్పుడు హమాస్ వారు జరిపిన దాడిలో ఎంతోమంది చనిపోయారట ... కాని ముందర
పేజిలో ఆ దేశానికే చెందిన ఒక వ్యక్తి ఎడారిలాంటి ఒక ప్రదేశంలో పంట పండించి
సాధించిన ఘనతని ముందర పేజిలో వేసారట... అదీ పత్రికా స్ఫూర్తి అంటే.. అని
ఒక పత్రికా ప్రసంగంలో పేర్కొన్నారు.. అదీ నిజమే కదా.. క్రికెట్ కు వున్న
క్రేజ్ గున్రించి.. పత్రికలే విమర్శిస్తాయి... కాని ఎన్ని పత్రికలు మిగతా ఆటల/ ఆటగాళ్ళ గురించి పత్రికలో ప్రచురిస్తున్నాయి... చెప్పండి..
ఒకప్పుడు.. భాష పరంగానే పత్రికలు విభజించబడేవి ..
మానవ జాతిలాగా...
ఇప్పుడు.... పత్రికలు ... కాస్తా... ప్రాంతీయ పరంగా... పార్టీల పరంగా.. విభజించబడ్డాయి
ఇంగ్లిష్లో NEWS అనే పదం.. నాలుగు దిక్కుల (NORTH , EAST , WEST , SOUTH ) ఆధారంగా సృష్టించబడిన పదం.. ఇప్పుడు ఆ నాలుగు దిక్కుల పేర్లు కాస్త... డబ్బు, అధికారం, పేరు , ప్రతిష్ట అనే వాటినే కాకుండా.. రాగ ద్వేషం , ఆశ్రిత పక్షపాతం, నమ్మక ద్రోహం , అన్యాక్రంతం అనే మరొక నాలు దిక్కులని ప్రతిబింబిస్తూ ... విరాజిల్లుతున్నాయి ..
ఒక్కప్పటి పత్రిక రంగ శక్తి వల్ల.. మనకు స్వతంత్రం, JP పార్టీకి అధికారం, ఇలా ఎన్నో...సంఘటనలకు కారణం అయ్యింది ...
ఇప్పటి పత్రికా రంగం వల్ల.. మనమధ్య.. వీణ మాలిక్, పూనం పాండే లు పెద్ద న్యూస్ అయ్యి కూర్చున్నారు... వారిప్పుడు ఏమి చేసినా ఇప్పుడు.. పత్రికా సంచలనమే.. వందమంది చనిపోనీ.. వేలమందికి అన్యాయం జరిగే సంఘటన జరిగినా ..
ఒక వీణ మాలిక్ కొత్త సినిమా చేస్తున్న వార్త .. లేదా.
పూనం పాండే.....ఏదో ఒక కారణం చూపించి... స్ట్రిప్ చేస్తానన్న వార్త ముందు.. దిగదుడుపే అవుతుంది
ప్రజల విషయం.. వెనక పేజీకి వెళ్ళి పోతుంది... ఇది ఇప్పటి పత్రికా రంగ పరిస్థితి...
నన్ను ఇప్పుడు ఎవరైనా.. గొప్ప జర్నలిస్ట్ పేరు చెప్పు అంటే.. కులదీప్ నాయర్ పేరే చెపుతాను.. బహుశ ఆయనకు 80 ఏల్ల వయసు ఉంటుందేమో... అయినా .. నాకు.. ఇంకొక పేరు గుర్తుకు రాదు.. ఇందుకు ఆయన గొప్పతనం ఒక కారణం అయితే.. ఇంకో ముఖ్య కారణం.. ఆయనలాగా ఇంకో గొప్ప జర్నలిస్ట్ వెలుగులోకి రాకపోవడమే..

పత్రిక , టెలివిజన్ రంగాలు అల బ్రస్తు పట్టిపోతుంటే..
ఇక నాకు తెలిసిన మిగిలిన సామాజిక రంగం సినిమా ప్రపంచం అదే చలన చిత్ర రంగం..
అబ్బ.. గత రెండు సంవత్సరాలలో.. వచ్చిన సినిమా పేర్లు చూస్తుంటే.. అసహ్యం వేస్తోంది..
రచ్చ, దమ్ము, రగడ, గబ్బర్ సింగ్ .. ఇవి ఈ మధ్య వచ్చిన పేర్లు..
ఎవడు, మెరుపు, జులాయి, బాద్షా,.. ఇవి రాబోయే పేర్లు..
కొన్ని పేర్లు వినడానికి చాల బాగుంటాయి ... పేర్లు పర్లేదు అనిపించే సినిమాలలో.. సందేశాత్మకంగా ఎన్ని వున్నాయో.. ఆలోచిస్తే.. మచ్చుకు ఒక్కటి కూడా కనపడవు..
మూస పోసిన సినిమాలు.. ఒక హీరో, ఒకరు లేదా ఇద్దరు నాయికలు .. ఒక పెద్ద విలను..
ఉన్నట్టుండి పదులు, వందలో సంఖ్యలో సుమోలు, స్కార్పియోలు ..
తరువాత ఏముంది ....
రక్తం... రక్తం....రక్తం... అంతే.. ఇప్పడి సినిమా...
ఒక సందేశం లేదు .. సందేశాత్మక పాటలు లేవు ....
ఇలా ఎందుకు అని అడుగుతే ..
ఇలాంటివే ప్రజలు ఆదరిస్తున్నారు కావున .. ఇలానే తీస్తున్నాం అని కొంతమంది సినిమా పెద్దల వాదన..
నాకు ఇప్పడికీ గుర్తు.. "ఆ నలుగురు" అనే సినిమాని ఎంత బాగా ఆదరిచారో.. మన తెలుగు ప్రజలు.. ఇలాంటి ఉదాహరణలు.. అలా చెప్పే వారికి గుర్తు రావడం లేదు..
గమనిస్తుంటే ...నిదానంగా...
అన్ని రంగాలలో.. విలువలు అడుగంటుతున్నాయి..
తెలియచెప్పే వారు లేరు..
తెలియచెప్పే వారికి.. ప్రోత్సాహకాలు లేవు..
జవజీవాలు ఉడిగి....
అంతరిస్తున్న తెలుగు భాషకు.. తులసి తీర్థం పోయడానికి..
మళ్ళీ ఎప్పుడు ఉద్భావస్తాడో... మరొక.. శ్రీ శ్రీ..
మళ్ళీ ఎప్పుడు ఉద్భావిస్తాడో.. మరొక సినారె అంటే Dr .సి.నారాయణ రెడ్డి..
మళ్ళీ ఎప్పుడు చూస్తామో.. తెలుగు భాషలో మంచి సాహిత్యం..
మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో .. పత్రికా రంగం రాజకీయాల పక్షం నుంచి.. ప్రజల పక్షానికి మారడం ...
ఇవి ఏవీ తెలియని.. నా మనస్సుకు..
ఈ అద్భుతాలు కాని అద్భుతాలు మళ్ళీ మళ్ళీ జరగాలని.. ఆ భగవతుని ప్రార్థిస్తున్నాను..
2 comments:
Super venkat gaaaru ... oka sagatu manishila alochiste vyavastha entha digajari pothondi telustondi.
Kevalam dabbu kosam prathi manishi aemaina rese, these, matlade , chupinche , vadulukune dustithi vachhesindi eeroje.
Mari repu ela vundabothunnayo ane bayam enko vypununchi puttukonstondi ...
Any way hatsoff to your article ...
Your efforts to convey the message won't go in vain. Oh btw, just an advise - your blog doesn't load any faster, rather it's very slow. You should be working on it to make it load a bit faster, optimizing it will help readers.
Post a Comment