Tuesday, January 26, 2010

నా గణ తంత్ర దినోత్సవ ప్రార్థన



ఓ భగవంతుడా  
నాకు నా దేశము గురించి ఆలోచించే ఆలోచనను ఇవ్వు నా 
కన్నా నా దేశము గొప్పది అనుకొనే సంస్కృతిని ఇవ్వు 
నా ప్రజలకు నేను సేవ చేయాలనే కర్తవ్య భోధన ఇవ్వు  
నా ఇంటి ప్రతిష్ట లాగే .. నా దేశ ప్రతిష్ట కూడా గోప్పదనుకునే భుద్దిని ఇవ్వు  

నా పుట్టిన రోజును నా మిత్రులతో.. ఎలా జరుపుకున్తానో... నా పెళ్లి రోజుని నా కుటుంబంతో ఎలా జరుపుకున్తున్ననో..నా గణ తంత్ర దినోత్సవాన్ని నా దేశ బాగు కోసం జరుపుకునే ఆలోచన ఇవ్వు ..  

గణ తంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికీ తేడా తెలుసోవడం నా కనీస ధర్మమూ అని తెలుసుకొనే జ్ఞానం ఇవ్వు.  

రోజు భగవంతున్ని ప్రార్థించి ఈ జీవితం ప్రసాదించినందుకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకుంటానో .. అలాగే ఈ రోజు ఇలా స్వతంత్రంగా గడుపుతున్నదుకు.. కారణమైన స్వతంత్ర సమర యోధులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకునే ఆలోచనను కూడా ఇవ్వు..

రంగు, జాతి, కులము, మతము కంటే మానవత్వము గొప్పది అని ఆలోచన కలిగేలా భావనను ఇవ్వు ..  

సినిమా పోస్టరు చూసి అందులో నటించిన వారి పేరు, వూరు టప టప చెపుతున్న నేను, నా జాతీయ పతాకాన్ని చూసిన వెంటనే అందులో వున్నా రంగుల గురించి, మధ్యలో వున్నా అశోక చక్రము గురించి, అందులో ఎన్ని ఊచలు ఉంటాయో....అదెందుకు అక్కడికి వచ్చిందో కూడా టప టప చెప్పే జ్ఞానము సంపాదించుకునే జ్ఞానం ఇవ్వు .

నా అభిమాన కథ నాయకుడి పేరు , కథానాయకురాలి పేరు, వారి ఇష్ట మైన ప్రదేశం పేరు చెప్పినట్టుగా... నా జాతీయ పక్షి, జాతీయ అట, జాతీయ గీతముల గురించి కూడా చెప్పే జ్ఞానం ఇవ్వు..

నేను గుక్క తిప్పుకోకుండా , స్క్రిప్ట్ చూడకుండా..పాడగల .. ఆ పాటల జాబితాలో నా జాతీయ గీతాన్ని కూడా చేర్చుకునే ఆలోచనని ఇవ్వు..  

నా మనసులో... నా మాతృ స్థానానికి సమానంగా నా దేశ స్థానాన్ని కుదిన్చుకునే స్వభావాన్ని ఇవ్వు.. నా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి... ఒక సీరియల్ ఎపిసోడే టైం సరిపోతుందనే భావనను ఇవ్వు.. కుంటుంబాన్ని ప్రేమించినట్టే , దేశాన్ని కూడా ప్రేమించొచ్చు అనే జ్ఞానం ఇవ్వు..
జాతి, మత, ప్రాంత కోసం కాకుండా దేశము కోసం పోరాడే శక్తిని ఇవ్వు
గాంధీ గారి కలల్ని సాకారం చేసుకునే శక్తిని ఇవ్వు


మీ
వెంకట రత్నం (నివెర)

1 comment:

Sandeep Mullangi said...
This comment has been removed by the author.