Monday, July 9, 2018

ఓ .. భారతమా .. తస్మాత్ జాగ్రత్త.. జాగ్రత్త

తెర నిండా నటిస్తూ..  
దేశంలోని చెడును మాత్రమే ఉదహరిస్తూ.. 
తానేదో.. దేశాన్ని.. ఉద్ధరించాలని.. తపన చూపిస్తూ.. 
మాట్లాడుతున్న ... టీవీ.. వ్యాఖ్యాతలను  చూస్తూ.. 
భ్రమలో .. మురిసిపోతున్న..   నా.. భారతమా మేలుకో.. 

అది అంతా ఒక నాటకమని.. 
ప్రతి తెర మీద నాటకాన్ని.. ఒక  తెర వెనుక వ్యక్తి..  నడిపిస్తున్నాడని .. 
అదంతా ఒక భూటకమనీ తెలుసుకోలేని 
ఓ భారతమా మేలుకో. 

రైతులే.. ముద్దు అంటూ.. 
రైతు..రాజ్యమే మా కల అంటూ.. 
ప్రజల వెంట తిరుగుతూ.. 

మన కులమే మేలంటూ.. 
మన మతమే మేలంటూ.. 
మనమొస్తే మేలంటూ 
మన వారి వెంటే నడవాలంటూ 
తెర వెనుక విజ్ఞాపిస్తున్న .. 
నాయకుల వెనుకల  తిరుగుతున్న.. ఓ .. భారతమా మేలుకో.. 

మా వాడు.. మన వాడు అంటూ.. 
మా వాడొస్తే .. మేలు చేస్తాడనీ .. 
మా ఇంటోడు వస్తే .. మేలు చేస్థాడనీ 
మా కులపోడే  వస్తే.. మేలు చేస్తాడనీ.. 
మా మతమోడే .. వస్తే.మేలు చేస్తాడనీ.. 
భ్రమలో బ్రతుకుతున్న భారతమా మేలుకో.. 
. 

మేలు చేసే నాయకుడు.. 
మనవాడు కాకపోయినా చేస్తాడు అనే నిజాన్ని  
మన భారతం ..  అటువంటి నాయకులను .. కోకొల్లలుగా . చూసిందని 
తెలిసి..కూడా.. 
ఇటువంటి వారితో .. మోసపోతున్న.. 
ఓ...  నా..  భారతమా..  మేలుకో.. 

వందల ఏళ్ళ చరిత్ర మోసం చేసిందని ..చూపిస్తూ.. 
ఆ మోసం యొక్క ఫలితాన్ని తను మాత్రమే అనుభవిస్తూ 
తనతో వున్న వాళ్ళకి.. 
తనను నమ్మిన వాళ్ళకి.. మాత్రం.. 
ఆవేశాన్ని.. మరియు.. చరిత్ర చేసిన మోసాన్ని.. చూపిస్తూ.. 
తన వాళ్లనే మోసం చేస్తూ.. 
తనను నమ్మిన  వారినే.. తొక్కి పడేస్తూ.. 
తనకు నచ్చిన వాళ్ళతో.. రాజ్యాన్ని విస్తరిస్తూ.. 
తానేదో.. త్యాగం చేస్తున్నాడని చూపిస్తూ.. 
తన జీవితం.. వారికే అంకితం అని.. నమ్మిస్తూ.. 
అదే నిజమని .. 
తమ నాయకుడు.. దేవుడు ఇచ్చిన వరం అని.. 
భ్రమలో బ్రతికేస్తున్న .. 
ఓ.. నా..  భారతమా మేలుకో .. 


మనం  చదవని.. మనకు  తెలియని చరిత్రని సృష్టిస్తూ .
మనం చదివినది ..  ..తప్పు అని నమ్మిస్తూ.. 
అప్పుడేదో  అన్యాయం  జరిగిందని .. 
ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేరేపిస్తూ .. 
ఆ అందరి ఆవేశం మధ్యలో.. తన యొక్క విజయ పరంపరను సాగిస్తూ.. 
తనకు మాత్రం అద్భుత ఆకాశ హర్మ్యాన్ని  నిర్మించుకుంటూ.. 
నమ్మిన వాళ్ళకి మాత్రం.. ఆ ఆకాశ హర్మ్య    నీడని చూపిస్తూ.. 
వాళ్ళు కట్టిన దాంట్లో విలాసంగా ఉంటూ.. 
వాళ్ళు వేసిన మంటల్లో...  చలి కాల్చు కుంటూ.. 
ఆ మంటల .  అలజడిలో  తెలియక పడి  మాడి  మసి  అవుతున్న
ఓ .. నా.. భారతమా .. మేలుకో 


జగమంటే .. మనమని.. 
మనమంటే.. జగమని.. 
జగత్హు అంత.. భారతాన్ని.. నింపిన.. 
మన చరిత్ర అమరులారా. 
రండి.. మీరు  నిర్మించిన .... భారతం.. భ్రమలో.. కొట్టు మిట్టాడుతోంది.. 
వచ్చి.. మన .. భారతాన్ని.. మేలు కొలపండి.. 

Sunday, July 19, 2015

మతమా మానవత్వమా ..

ఇటీవల నేను ఒక ప్రయాణంలో  ఒక పెద్ద కుటుంబంని చూసా .  వారిలో  కొంతమంది పిల్లలు   ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు వారు వారితోపాటి ఉన్న ఒక ఆవిడని లాక్కొఛారు..  అప్పుడు ఇంకో ఆమె ఆ పిల్లలతో లాక్కొచ్చిన ఆవిడతో కలిసి ఫోటో దిగొద్దు అని ఆ పిల్లలతో చెప్పింది . వారు ఆ సలహాకు ప్రాధాన్యత  ఇవ్వకుండా ఫోటో దిగారు.  అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న ఒకాయన  విసురుగా వచ్చి ఆ కెమెరాలోని ఫోటోని తీసేశాడు .

నేను అది చూసి ఆశ్చర్యపడ్డాను   తరువాత నేను ఒక వ్యక్తిని ఏంటి సర్ వారికి అంత కోపం అని అడిగాను . 
అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు . 
ఆమె ఇంకో కులానికి చెడిన వ్యక్తి . కాని ఆమె వీరింటి అబ్బాయిని చాలా ఏళ్ళ క్రితం పెళ్లి చెసుకుంది .  ఆమె భర్త గారి కుటుంబంలో అందరూ విద్యాధికులే . అందులో కొంతమంది డాక్టర్లు కూడా వున్నారు .  ఆ పెళ్లి తరువాత అబ్బాయి కుటుంబంతో సంబంధాలు బాగుందేటివి కాదట . ఆమె దురదృష్టవశాత్తూ పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకి వారి భర్త చనిపొయారు. ఆమె భర్త చనిపోయే సమయానికి వారికి ఇద్దరు అమ్మాయిలు. చనిపోయిన తరువాత కూడా వారి భర్త కుటుంబం వారు ఆదుకొలెదు.   ఆమె భర్త మరణం తరువాత ఆమే  ఇద్దరు అమ్మాయిల్నీ చదివించి పెద్ద  చేసింది .. ఒకరు ఇంజనీర్ అయ్యారు అండ్ మరి ఒక అమ్మాయికి  బ్యాంక్లో ఉద్యోగం దొరికిన్ది.. వారి అమ్మాయిలే ఇప్పుడు ఆమెను చూసుకుంటున్నారు .. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలూ సొంత ఊరికి దూరంగా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు .. ఆమె ఒక్కతే  వారి వూరిలో వుంది ..  ఇది క్లుప్తంగా జరిగిన సంగతి  .. ఇదంతా జరిగి 20 సంవత్సారాలు అయి ఉంటుందేమో .. అయినా ఇంకా ఆ ద్వేషాన్ని ఆమె భర్త కుటుంబ సభ్యులు ఆమె మీద చూపిస్తూనే వున్నారు 


పై సంఘటన జరిగిన సమయంలో 
నా  మదిలో కలిగిన మొదటి ప్రశ్న!!!
మతమా మానవత్వమా .. ???
అప్పుడు నాకు నాకు అనిపించినా ఒక భావ రూపమే ఈ వ్యాసము 
ఇది నా మనస్సులోని   భావాలే ... నా మదిలోని  ఆలోచనలే 
మానవత్వమనేది  మతం కంటే గొప్పది కాదా 
మానవత్వం తరువాత మతం వచ్చిందా ..   అది సరైతే మతం వచ్చి మానవత్వాన్ని మంట కలిపెసిందా ..


నేను గమనిస్తే  ఇక్కడ నాకు   కొన్ని  విషయాలు స్పురించాయి  
1. మానవ తత్వమే అన్నది మతం 
2. మతం అన్నది  మానవత్వం లోని ఓక చిన్న భాగం 

కదా.. 

ఒకప్పుడు కలశ్నికోవ్ అనే వ్యక్తి  A K 47 అనే తుపాకిని  సిపాయిల స్థైర్యాన్ని పెంపొందించడానికి కనిపెట్టాడు . కాని అది తీవ్రవాదుల చేతుల్లో పడి  మానవాళి మనుగడకు ఒక సవాలు అయి కూర్చొని వుంది 

కాన్సర్   దూరం చేసే రేడిఎషన్ కనిపెట్టారు క్యూరీ దంపతులు , కాని అదే అణు  బాంబు అయి.. మానవాళికి సవాలు అయి కూర్చుంది 

అలాగె.. మానవడు తన అస్తిత్వాన్ని మందింపు చేసుకోవడం కోసం మతం అనే పదాన్ని.. సృశ్ష్టించుకున్నాడు  . 
అదే మూడు అక్షరాల  పదం .. రెండు  వందల  పైచిలుకు  దేశాల ప్రజల్ని.. అంటే 700 కోట్ల ప్రజల్ను.. 
పలు పలు విధాలుగా చీలుస్తూ మానవాళి మనుగడకు సవాలు విసరడముతో సరిపెట్టుకోకుండా .. 
మానవాళి మనుగడని ప్రశ్నార్థకం చేసే స్థితికి  ఎదిగినది  .. 

కొంతమంది మేధావులు ..
మానవ జీవన సమతుల్యత కోసం ..
ఈ మతాన్ని .. అభిమతానికి  తగ్గట్టు కులాలను శ్రుష్టించారు..  
ఈ కులం మరియు మతం కలిసి మానవుల్లోని   మానవత్వాన్ని .. మరింత దిగజార్చేస్తున్నాయి.. 
చివరికి.. ఈ కుల మరియు మత పిచ్చి వల్ల..  ఈ మధ్య వార్త పత్రికలో చూస్తున్న సంఘటనలను చూస్తుంటే .. మానవునికే  జుగుప్స కలుగుతుంది .. 
మనందరికీ తెలుసు..  ఈ జీవ జాలములో .. పాము మరియు పులి లాంటి కొన్ని జాతులు మాత్రమె తన కన్న పిల్లల్ని చంపుకుంటాయి అన్నది.. 
పాము లాంటి విష ప్రాణి  కూడా తప్పని పరిస్థితుల్లో .. ఈ పని చెస్థాయి.. 



మానవులం .. 
మనది మానవ జన్మ.. అని గొప్పగా చెప్పుకుంటాము 
ఎంతో అదృష్టముంటే కాని దొరకని.. ఈ జన్మ .. అని మనం సృష్టించిన లేదా మనల్ని  సృష్టించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుతాము .. 
ఇలాంటి మానవ జన్మ జన్మించి.. 
ఒక పాము లాగా..  క్షమించాలి.. పాము కంటే హీనంగా... సొంత పిల్లలని.. చంపుకుంటున్న తల్లి తండ్రులను చూస్తుంటే
నాకు జాలి .. కాదు.. ఏహ్య భావం కలుగుతున్నది .. 
ఈ మధ్య.. మనం ఇటువంటి వార్తలు ఎక్కువ  వింటున్నాము .. . 


ఒక సారి అలొచిస్తే ..  
అసలు మతం అంటే ఏమిటి అన్నది ఎంత మందికి తెలుసు.. 
అసలు మతం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఎంత మంది  ప్రజలకు అనిపించి ఉంటుంది 
అర్థమే తెలీని నేను 
మతం పేరిట ..
కులం  పేరిట 
మారణ హోమం సృష్టించడం ఎంత వరకు సమంజసమ్.. 
నాకు మతం అంటే ఏమిటో .. కులం అంటే ఏమిటో తెలుసు అని కాదు.. 
నాకు కొంచెం మాత్రమె తెలుసు.. 
నాకు తెలిసినంత వరకు.. మతం అర్థం కూడా కొంచెమే అయి వుండొచ్చు అని నా నమ్మకం  
నా వరకు.. మతం అంటే .. ఒక జీవన విధానం .. అంతే .. 


కాని ఎక్కువగా.. మనం ఎలా అర్థం చేసుకుంటాము ..అంటే .. 
అందులో లేనిది.. అలా చెప్పనిది  మన మతం కాదనే బ్రమలో ఉంటాము .. 
ఈ భ్రమని కొంతమంది అవకాశవాదులు .. వాడుకుని..  మన మనస్సుల్లో చిచ్చు రగులుస్తారు .. మనలోని ఆవేశాన్ని వాడుకుంటారు  


నా జీవితంలో ఎంతో మందిని చూసాను ..వారికి లేని పట్టింపు ఇతరులకు పట్టిస్తారు .. 
ఎందుకంటే ఆ పట్టింపు  లేనట్టు ప్రజలకు తెలిసిన వెంటనే .. వారి ఉనికే ప్రశ్నార్తక వుతుంది .. 
మన మెగాస్టార్ చిరంజీవి గారు.. కొత్త పార్టీ పెట్టారు ...  మనమంతా చిరంజీవి అభిమానులని నమ్ముకుని  పెట్టారు అనుకుంటాము .. ఈ విషయం కొంత వరకు నిజమే  కాని..  నిజానికి మనలో చాల మందికి  ఆయన ఒక వర్గానికి మద్దతుగా నిలపడ్డారు .. అంటే .. ఒక కులం ఓట్లను .. మరియు.. వారి ప్రాబల్యాన్ని పెంపొందించడానికి ... అదే చిరంజీవి గారి కుమారుడు ..వేరే కులము అమ్మాయిని పెళ్లి చెసుకున్నాడు అన్నది మనకు అందరికీ తెలిసిన విషయం .. చిరంజీవి గారి  స్టైల్ ను.. చిరంజీవి గారి ప్రతి కదలికని .. ప్రాణానికి సమానంగా అనుకరించెవారు.. ఇలాంటి నిజ జీవితంలో ఆయన తీసుకున్న మార్గాన్ని ఎందుకు అనుకరించరు.. 

వివాదాస్పదం అనుకోకుంటే .. 
ఉదాహరణకు
అమెరికా ప్రభుత్వం .. అమెరికాలో స్థిర పడాలంటే .. క్రైస్తవం పాటించాలని దిక్కత్  ప్రకటించింది అని అనుకొండి ... అప్పుడు ఎంతమంది అమెరికాలో ఉన్న విదేశీయులు  మతానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి స్వదేశం  తిరిగి వస్థారు...  ప్రజలు ఒప్పుకోరు కాని.. ఎక్కువ శాతం  ప్రజలు వెనక్కి రారు.. అంతే..   కారణాలు  ఏవి అయినా చివరి నిర్ణయం .. గురించి మాత్రమె నేను విశదీకరిస్తున్నాను ...

అలాగే .. మన ఆంధ్ర , తెలంగాణా రాష్ట్రాలలోంచి అరబ్ దేశాలకు లక్షల్లో వెలుతుంటారు
ఒకవేళ అరబ్ దేశాల ప్రభుత్వం .. వచ్చినవారు అందరూ మహమ్మదీయులే  అయి వుండాలి   అంటే .. పొట్ట కూటి కోసం పోతున్న ఎక్కువ శాతం  ప్రజలు తప్పక మహమ్మదీయులు  గా  మారి   వెళ్తారు ...

ఇది అరిగించుకోలేని  లేదా అరగని నిజం ..
స్థిరంగా అలొచిస్థె.. నిజం బోధ పడుతుంది ...
కావాలంటే మీరు పరీక్ష చేసుకోండి .....


అది ఏ నిర్ణయమయినా  నేను తప్పు అని అననే అనను..
ఎందుకంటే మానవునికి   ముఖ్యం ఏమిటి అని ఆలోచిస్తే ..
క్షమించాలి ..
మానవుని మనుగడకి ముఖ్యం ఏమిటి అని ఆలోచిస్తే ..
ముఖ్యంగా
కూడు ...  సమయానికి మండే కడుపు కోసం ...
గుడ్డ ...  మానాన్ని కాపాడుకోవడం కోసం ...
కూలి ... మానంగా  జీవించడం కోసం ..
వీటి తరువాతనే వేటివి అయినా..


మీరు ఎవరైనా.. పై మూడు లేని వాడు .. మతం లేదా కులం గురించి మాట్లాడడం విన్నారా..
నేను అయితే వినలెదు..

నేను ఎలా ఊహించుకుంటాను అంటే ..
జీవితం అనేది .. ఒక రోడ్డు అంతే .. అంటే ఒక రహదారి లాంటిది
అందులో  పెద్ద  వాహానాలకి మాత్రమె (అంటే కడుపు నిండిన వారన్న  మాట).. ట్రాఫిక్ జామ్ చెసె.. అవకాశం వుంటుంది ...
అదే ఒక మోటార్ సైకిల్ లేదా.. ఒక సైకిల్ .. లాంటి వాహనం ఎక్కడ దారి వుంటే దారి వుంటే అందులో దూసుకు పోతుంది ..
జీవితం కూడా అంతే ...

మతం మరియు కులం అనేటివి అనెస్తీషియా (మత్తు మందు)  లాంటిది .. ఇదే మాట .. ఎప్పుడో కార్ల్ మార్క్స్ చెప్పాడు ..
ఎలాగయితే ..
మత్తు మందు ఇచ్చిన తరువాత ఎలాగయితే కాలు తీసినా .. చెయ్యి తీసినా .. చివ్వరకు ప్రాణం తీసినా తెలీదొ..
మతం మరియు కులం కూడా ఇలాంటివే ...  ఈ మత్తు ఆవహిస్తే మన చుట్టుపక్కల ఏమి జరిగినా మనకు   తెలియకుండా వుంటుంది ..
అందుకే  తల్లి తండ్రులు కన్నపిల్లలను .. ప్రాణంతో సమానంగా పెరిగిన స్నేహితులు స్నేహాన్ని చంపుకుంటున్నారు .. ఎంత దురదృష్టం 

కావున 
ఎలా ఉండాలో చెప్పేది  మతము అంతే . 
ఎలా ఉండకూడదో అనేది.. మతం చెప్పదు.. 

ఏది నమ్మాలో మాత్రమే మతం చెపుతుంది .. ఏది నమ్మకూడదో మతం ఎన్నటికీ చెప్పదు.. 
ఎక్కువ శాతం మంది ప్రజలు..   రెండో విధానాన్నే ఎక్కువ మంది అవలంబిస్తారు .. 
ఇదే సమస్యకు పునాది.. 

మతం అన్నది మత్తు కాకూడదనీ ... 
కులం అన్నది కుంపటి కారాదనీ .... 
మతం .. కులం .. చిచ్చుతో  చీల్చబడ్డ ..ఏ జాతీ లేదా ఏ రాజ్యం  ప్రశాంతతతో ... సాగదనీ ... అది మన దేశం  లోని  కాశ్మీర్ కావొచ్చు .. లేదా మన పక్క దేశాలయినా శ్రీలంక..  పాకిస్తాన్ కావొచ్చు.. 

మానవుడు ఈ మూడు అక్షరాల పదాల్ని .. 
ఏడూ ఖండాల ప్రజల్ని ఏకం చేసేందుకు వాడాలని.. వాడుకొవాలని.. 
మానవత్వాన్ని పెంపొందించడానికి వాడుకోవాలనీ...  
ప్రార్థిస్తూ ... ఆకాంక్షిస్తూ
సెలవు తీసుకుంటున్నాను 

Sunday, October 26, 2014

పర నింద.. ఆత్మ స్తుతి..


ఏమి జరుగుతోంది ఇక్కడ..
నాకు తెలియాలి..నాకు తెలియాలి..నాకు తెలియాలి..

వారం క్రితం వరకు.. కెసిఆర్ కనపడక పోయేసరికి .  ఇది చాల మంది ప్రజలు అడిగిన  ప్రశ్న..
నేను అనుకున్నాను.. ఆయన మారాడు..  ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి.. ఆలోచిస్తున్నాడు అని..
నేను అనుకున్నాను.. ఆయన రాజ్యాంగ పదవి అయిన  ముఖ్య మంత్రి పదవి యొక్క పద్ధతి.. విలువలు.. తెలుసుకుని  మసలుకొంటున్నాడు  అని ..
నేను అనుకున్నాను... ఆయన  రైతుల ఇబ్బందుల  గురించి. ఆలోచిస్తున్నాడు  అని ..
నేను అనుకున్నాను..  అసలే తీవ్ర విద్యుత్ సంక్షోభం లో వున్న తెలంగాణా రాష్ట్రాన్ని.. సంక్షోభంలోంచి  బయటకు ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నాడు అని ..
నేను అనుకున్నాను.. ఆయన  హైదరాబాద్ పరిశ్రమలకు.. పవర్ హాలిడే తగ్గించి.. శ్రామిక లోకాన్ని.. కార్మిక లోకాన్ని.. పరిశ్రమ లోకాన్ని.. సంక్షోభం లోంచి.. బయటకు  ఎలా  తేవాలా    అని.. ఆలోచిస్తున్నాడు అని ..
నేను అనుకున్నాను.. ఆయన.. ప్రజల మధ్య.. విభజన రాజకీయాలు మానేసాడు అని ..

చెప్పలేక పోతున్నాను కాని.. నవ్వోస్తున్నా చెప్పేస్తున్నా...
 ప్రతి చేత కాని పనికీ.. చంద్ర బాబుని.. అటుపక్క ప్రభుత్వం మీద  దుమ్ము వేయడం ఆపు చేస్తాడని అని ..
పాటకులకు బోరు కోతుందేమో అని.. ఇలా ఎన్నో అన్నుకున్నవన్నీ చెప్పలేక పోతున్న..
ఇన్ని  మంచి విషయాలు  అనుకున్న  నా   అన్ని ఆలోచనలు  ఫట్టాపంచలు అయ్యాయి ..

మొన్న జరిగిన  కెసిఆర్  ప్రెస్ మీట్  చూసిన తరువాత .. నేను అనుకున్నవన్నీ.. కల్లలే అని అర్థం అయింది..
పైన నేను చెప్పిన  వాణ్ణి.. కల్లలే అని  కెసిఆర్ గారి ప్రెస్ మీట్ ..విన్న ప్రతి వోక్కరికీ అర్థమయ్యి వుంటుంది..

దురదృష్టవశాత్తు మన దేశంలో .. నీళ్ళ కోసం కొట్టుకోని  .. కోర్టుకు ఎక్కని.. రాష్ట్రాలు లేవంటే.. నమ్మాలి..
కాని మనం గమనించాల్సింది ఏమిటంటే.. ప్రతి  ముఖ్యమంత్రి/రాష్ట్ర ప్రభుత్వం  న్యాయ పరంగా వెళ్లి సాధించుకోవాలి అనుకున్నారు కాని..  పక్క ముఖ్యమంత్రుల్ని దుమ్మెత్తి పోయలేదు..కాని మన కెసిఆర్ గారు అది చేస్తున్నారు..

తిట్టడం  వాల్లన్దిరికీ చేత కాక కాదు..
ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే..
అందరికీ నోరుంటుంది.. అందరికీ ఏదో ఒక భాష ఉంటుది.. అన్ని భాషల్లో తిట్లు వుంటాయి.. అందరికీ KCR లా కాకపోయినా.. ఏదో ఒక తిట్లు తెలిసి వుంటాయి.. ఉపయోగించడం తెలిసి వుంటుంది..
కాని వాళ్ళందరూ విజ్ఞులు.. కావున.. వాళ్ళు తిట్ల  విధానాన్ని ఉపయోగించరు .. అంతే..
ఉదాహరణకు  ఈమధ్య కాలం లో.. తమిళనాడు ముఖ్యమంత్రి కారాగారం పాలయినప్పుడు.. ఆమె.. ప్రజలకు శాంతి సందేశం పంపారు.. అది విజ్ఞత..

భారత దేశం అహింసా విధానానికి పెట్టింది పేరు..
మహాత్ముడు.. పాటించిన ఈ విధానం ప్రపంచ ఉద్యమ విధాన్నాన్ని మార్చింది..అంటే అతిశయోక్తి కాదు..
అందుకే  ఈ మధ్య కాలంలో.. ప్రపంచంలో.. నిరసనని తెలుపడానికి.. ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు..
అలాంటి  దేశంలో.. పుట్టి.. ఆయన పద్దతిని.. కొంచెం కూడా పాటించకుండా..
ముఖ్య మంత్రి అయిన తరువాత కూడా.. కేవలం విప్లవ విధానాన్ని. ఎన్నుకోవడం ..  నమ్ముకోవడం.. కెసిఆర్ గారు చేస్తున్న తప్పు అని నా అభిప్రాయం..
అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి
ఒక  కొత్త  రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారకునికిగా గుర్తించబడ్డ ఇతడే నా ఆ ఈ  KCR అని అనిపిస్తోంది.. ఒక నాయకుడు అంటే.. కష్టాల్లో కూడా తనే ముందుండి .. సమస్యలు పరిష్కరించాలి..
మాటలతో కాకుండా చేతలతో.. విమర్శకుల నోళ్ళు మూఇస్తున్న చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి.. HudHud తూఫాన్ సమయంలో ఆయన చూపించిన పరిపక్వత స్వంత రాష్ట్ర ప్రజల మనసులె కాకుండా.. ఇతర రాష్ట్రాల వారి మనసులు కూడా దోచుకున్నారు..

కాని.. చాల మంది.. గమనించాల్సింది.. ఒకటి వుంది..
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత.. సామాజిక  అనుసంధాన వేదిక..అదేనండి.. సోషల్ నెట్వర్కింగ్ లో .. ప్రజల విద్వేషాలను గమనిస్తే.. భారత్ vs పాకిస్తాన్ గుర్తుకు వస్తుండేది..  అంత విద్వేషం కనపడేది.. Facebook పోస్ట్స్ మరియు కామెంట్స్ లో..
మనం గమనిస్తే .. ఒకప్పుడు..  వినడానికి.. చెప్పడానికి..పలకడానికి..సిగ్గు పడే పదాలు.. ఈ అనుసంధాన వేదికలలో.. ఎన్నో ఉండేవి.. ఇది నా మనసుకు బాగా బాధించిన విశయం ..
ఈ మధ్య కాలంలో.. గమనించింది   .. ఏమిటంటే.. విద్వేషాలు బాగా తగ్గిపోయాయి..
ఇప్పుడు.. పరస్పర విమర్శలు మాత్రమె వస్తున్నాయి..
ఎందుకంటే.. విద్వేషం అనేది.. మండే మంట లాంటిది.. అందులో..  రేచ్చకోట్టుకోవడం  అనే నూనెను ఆపేస్తే.. మంట  అదంటకదే చల్లారుతుంది..
ఈ మధ్య.. రెచ్చకొట్టుకోవడం   తగ్గి.. విద్వేషం అనే మంట.. తగ్గుతోంది..
ఇది.. ప్రజలలో వస్తున్న మార్పు..
మా పల్లెలో.. ఒక రైతు ఆత్మహత్య చీసుకుంటే.. అందుకు.. పక్క రాష్ట్ర ముఖ్య మంత్రిని. బూచిగా  చూపిస్తే.. ఎవరి మనన్సైన.. ఎన్ని రోజులు ఊరుకుంటుంది.. చెప్పండి..

ఇప్పటికైనా.. ప్రజల గురించి ఆలోచించడం మొదలు పెట్టి..
కలసి వుంటే కలదు సుఖం అని..
పర నింద.. ఆత్మ స్తుతి మంచిది కాదని గమనించాలని..
ఒక రాష్ట్రము అన్నాక... పొరుగు రాష్ట్రాలతో అభిప్రాయ బేదాలు సహజమని.. గుర్తిస్తూ..
ఎవరి రాష్ట్రానికి .. వారి రాష్ట్ర ప్రజల సౌఖ్యం ముఖ్యం అనేది గమనిస్తూ..

పక్క రాష్ట్రాలపై నిందలు వేయడం వల్ల .. మనకు తెలియకుండా.. మన చేతకానితనాన్ని ప్రపంచానికి చెప్తున్నట్టు గమనించాలి..
తొడ కొట్టడాలు.. చాలెంజ్ చేయడాలు .. సినిమాల్లో బాగుంటాయేమో  కాని..  ప్రభుత్వ పాలనలో హర్షించరనీ ..
చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కాని.. బహిరంగ చర్చల ద్వారా.. కాదని తెలుసుకోవాలని .. అకాంక్షిస్తూ .. ప్రార్థిస్తున్నాను

Thursday, October 18, 2012

Increasing Blood PlateLet Count with Papaya

I am just posting a copy & paste of some article from one site thinking this will definitely useful for any one who is reading my blog.

Courtesy:news.yahoo.com
Link: http://shine.yahoo.com/healthy-living/papaya-leaf-juice-remedy-for-dengue-fever-252188.html

I discovered something interesting recently when I visited a friend who was hospitalized for dengue fever. It's a fact that, to date, there's no known medical cure for dengue fever since it's caused by a virus transmitted through the bite of the Aedes mosquito. However, it seems drinking papaya leaf extract helps to bring up the platelet count. One friend recounted that some months back, she too was hospitalized for dengue fever and one of her church members fed her the juice from raw papaya leaves and her platelet count went up from 8 to 120 (the normal platelet count is 150) after taking the juice for 2 days.
The recipe is quite simple really. Two pieces fresh papaya leaves (use only the leafy part, remove the stalks), wash clean, pound and squeeze out the juice. That should yield approximately 2 tablespoons of bitter juice to be taken as it is. Do not boil or dilute with water. One serving per day is recommended.
Also recommended that you grow your own papaya tree, just in case. Just kidding! But not a bad idea, don't you think?

Wednesday, June 13, 2012

దేశ భాషలందు తెలుగు... తెలుగు లెస్సనా .... లేక ఇంగ్లీష్ లెస్స(LESS)నా ..


మనకు స్వతంత్రం 1947 లో వచ్చింది అని మన అందరికీ తెలుసు..
ఎందరో  మహానుభావుల కృషి మరియు త్యాగాల పలితం మనకు దక్కిన ఈ స్వాతంత్ర్య ఫలం..
ఈ  స్వాతంత్ర   సంగ్రామంలో... ఈ మహానుభావులతోపాటు ... తన వంతు పాత్రను పోషించాయి.. అప్పటి.. విజ్ఞాన , వినోద సాధనాలు అయిన.. పత్రిక మరియు నాటక  రంగాలు..
మానవ విజ్ఞాన అభివృద్ధి  ద్వారా.. మనం సృష్టించిన  సినిమా  మరియు టీవి రంగాలను కూడా ఇందులో చేర్చాము.

ఒకరి భావాన్ని ... పది మందికీ తెలియజెప్పే.. ఈ సాధనాల శక్తి గ్రహించే.. బాపు లాంటి వాళ్ళు కూడా "హరిజన్" , "నవజీవన్" అనే పత్రికలలో విలేఖరి గాను, ఎడిటర్ గాను పని చేసి.. దాని ద్వారా.. స్వతంత్ర భావాలని.. సాటి భారతీయులలో  పెంపొందిన్చగలిగాడు .

మరి ఇప్పుడు.. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన దుస్థితి చూస్తే.. మనందరికీ జాలి కలగకమానదు..
ఏ పత్రికను  చూసినా.. ఏదో ఒక రాజకీయ పార్టీకి సంభందించిన కరపత్రిక అన్నట్టు తయారు అయ్యిందా  అన్న సంశయం మనకు కలుగకమానదు..
ఈ గజిబిజి ఆటలో.. ఏ పత్రిక రాసిన వార్తలో.. ఎంత నిజం వుందో.. గ్రహించడానికి... సాటి పత్రికాపాటకుడు ..
తికమకపడిపోతున్నాడు...అన్న మాట  వాస్తవం ..

పది, పదిహేను సంవత్సరాల ముందు.. ఈనాడు పత్రికను ఐఏఎస్ కు చదివే విద్యార్థులకు.. రెకమెన్డేడ్ (Recommended)    పత్రిక.. ఎందుకంటే.. అప్పడు..ఆ పత్రికలో  దేశ, విదేశ, రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల గురించి.. విపులంగా వివరించే వారు..
మరి ఇప్పుడు.. ఆ పత్రిక చూస్తే.. రాజకీయాలు తప్ప వేరే వార్త కనిపించడం లేదు..
ఇలాంటి  సంఘటనలవల్ల .. మన తెలుగు వారికి.. ఆంగ్ల పత్రికలను ఆశ్రయించే పరిస్థితి దాపురించిది..
మీరే చెప్పండి.. మన అందరి కుటుంబాలలో.. ఎన్ని  కుటుంబాలు ఆంగ్ల పత్రిక   మాత్రమే  తెప్పిస్తున్నాము.. 
ఆంగ్లములో పర్లేదు అనిపించే పట్టు వుంటే చాలు .. చాలా  మంది ఆంగ్ల పత్రికలనే ఆశ్రఇస్తున్నారు..

ఆసలే తెలుగు భాషకు... చదలు పట్టేసింది..
ఒకప్పుడు  తెలుగు  రాసే వారు తక్కువ వుండేవారు
తరువాత చదివే వారు  తగ్గారు 
ఇప్పుడు మాట్లాడేవారూ .. తగ్గుతున్నారు..
ఇప్పడికే   మనము  చాలా మందిని చూస్తుంటాము.. నాకు తెలుగు మాట్లాడడం వచ్చు.. కాని చదవడం రాదు అని.. కాని  వారు ఆంగ్ల నవలలు చదువుతారు.. పెద్ద చదువులు ఆంధ్ర రాష్ట్రములోనే చదివింటారు...
ఈ విషయంలో తప్పు వారిని కాదని నేను అనుకుంటాను ..
ఒక హోటల్లో  మంచి రుచుల వంటలు లేకపోతే .. ఆ  హోటలుకు ఎవరూ వెళ్ళరు .. హోటల్ లాంటిదే భాష కూడా ..మంచి రుచి లేక.. రుచి వున్న భాషను  ఆశ్రయిస్తారు ...
ఈమధ్య వచ్చిన "జల్సా" అనే సినిమాలో ఒక లైన్  వుంది .. "అదే మన తెలుగులో అంటే.. "DONT  WORRY  BE  HAPPY " .. నేను అది విని.. పగలబడి నవ్వాను .. పాటల రచయితలకు తెలుగు ఏదో .. కాదో తెలియనంత భ్రమలో మనల్ని  మున్చుతున్నారేమో  అనిపించింది ... పాటకులు నన్ను  క్షమించాలి .. నేను తప్పుగా అర్థం చేసుకునివుంటే .....

ఇలా ఉన్నప్పుడు ..
ఇక ఈ వినోద సాధనాలు కూడా... మనలో ఆ రుచినీ  అంటే ఉత్సుకతను తీసుకు రాకపోతే... తెలుగు భాషకు.. అంతం మరింత దగ్గర పడ్డట్టే..
చెబుతే.. నవ్వు వస్తుంది కాని.. అంతో ఇంతో తెలుగువారు  తెలుగు భాష చానల్స్ చూస్తున్నారంటే.. సీరియల్సు అనగా ధారావాహికల పాత్రను మెచ్చుకోవలిసిందే..   :)
ఎందుకంటే.. వార్త ఛానల్ లు.. కూడా రాజకీయ పార్టీల భావాలనే.. ప్రతిబింబిస్తున్నాయి..

ఒకసారి అబ్దుల్ కలాం భారతీయ మీడియా గురించి చెపుతూ.. మన పత్రికలూ ఎప్పుడు చెడు సంఘటనలే ఎందుకు ముందర పేజిలో వేస్తారు...  ఒకసారి ఆయన ఇజ్రాయెల్లో  ఉన్నప్పుడు  హమాస్ వారు జరిపిన దాడిలో ఎంతోమంది చనిపోయారట ... కాని ముందర పేజిలో ఆ దేశానికే చెందిన ఒక వ్యక్తి   ఎడారిలాంటి  ఒక  ప్రదేశంలో పంట పండించి సాధించిన ఘనతని  ముందర పేజిలో వేసారట... అదీ పత్రికా స్ఫూర్తి అంటే.. అని ఒక పత్రికా ప్రసంగంలో పేర్కొన్నారు.. అదీ నిజమే కదా..  క్రికెట్ కు  వున్న క్రేజ్ గున్రించి.. పత్రికలే విమర్శిస్తాయి... కాని ఎన్ని పత్రికలు మిగతా ఆటల/ ఆటగాళ్ళ  గురించి పత్రికలో ప్రచురిస్తున్నాయి... చెప్పండి..

ఒకప్పుడు.. భాష పరంగానే పత్రికలు విభజించబడేవి  ..
మానవ జాతిలాగా...
ఇప్పుడు.... పత్రికలు ... కాస్తా...  ప్రాంతీయ పరంగా... పార్టీల పరంగా.. విభజించబడ్డాయి
ఇంగ్లిష్లో  NEWS  అనే పదం.. నాలుగు దిక్కుల (NORTH , EAST , WEST , SOUTH ) ఆధారంగా సృష్టించబడిన పదం..  ఇప్పుడు ఆ నాలుగు దిక్కుల పేర్లు కాస్త... డబ్బు, అధికారం, పేరు , ప్రతిష్ట అనే వాటినే కాకుండా..  రాగ ద్వేషం , ఆశ్రిత పక్షపాతం, నమ్మక ద్రోహం , అన్యాక్రంతం  అనే   మరొక నాలు దిక్కులని ప్రతిబింబిస్తూ ...    విరాజిల్లుతున్నాయి  ..

ఒక్కప్పటి పత్రిక రంగ శక్తి వల్ల.. మనకు స్వతంత్రం, JP పార్టీకి అధికారం, ఇలా ఎన్నో...సంఘటనలకు కారణం  అయ్యింది ...

ఇప్పటి పత్రికా రంగం వల్ల.. మనమధ్య.. వీణ మాలిక్, పూనం పాండే లు పెద్ద న్యూస్ అయ్యి కూర్చున్నారు... వారిప్పుడు ఏమి చేసినా ఇప్పుడు.. పత్రికా సంచలనమే.. వందమంది చనిపోనీ.. వేలమందికి అన్యాయం జరిగే సంఘటన జరిగినా ..
ఒక వీణ మాలిక్ కొత్త సినిమా చేస్తున్న వార్త .. లేదా.
పూనం పాండే.....ఏదో ఒక కారణం చూపించి... స్ట్రిప్ చేస్తానన్న వార్త  ముందు.. దిగదుడుపే  అవుతుంది
ప్రజల  విషయం.. వెనక పేజీకి  వెళ్ళి పోతుంది... ఇది ఇప్పటి పత్రికా రంగ పరిస్థితి...

నన్ను  ఇప్పుడు ఎవరైనా.. గొప్ప జర్నలిస్ట్ పేరు చెప్పు అంటే.. కులదీప్ నాయర్ పేరే చెపుతాను.. బహుశ ఆయనకు 80 ఏల్ల  వయసు ఉంటుందేమో... అయినా  .. నాకు.. ఇంకొక పేరు గుర్తుకు రాదు.. ఇందుకు ఆయన గొప్పతనం ఒక కారణం అయితే.. ఇంకో ముఖ్య కారణం.. ఆయనలాగా ఇంకో గొప్ప జర్నలిస్ట్ వెలుగులోకి రాకపోవడమే..

పత్రిక , టెలివిజన్  రంగాలు అల బ్రస్తు పట్టిపోతుంటే..
ఇక నాకు తెలిసిన మిగిలిన సామాజిక  రంగం సినిమా ప్రపంచం అదే చలన చిత్ర రంగం..
అబ్బ.. గత రెండు సంవత్సరాలలో..  వచ్చిన సినిమా పేర్లు చూస్తుంటే.. అసహ్యం వేస్తోంది..
రచ్చ, దమ్ము, రగడ, గబ్బర్ సింగ్ .. ఇవి ఈ మధ్య వచ్చిన పేర్లు..
ఎవడు, మెరుపు, జులాయి, బాద్షా,.. ఇవి రాబోయే పేర్లు..
కొన్ని పేర్లు వినడానికి చాల బాగుంటాయి ...  పేర్లు పర్లేదు అనిపించే సినిమాలలో.. సందేశాత్మకంగా ఎన్ని వున్నాయో.. ఆలోచిస్తే.. మచ్చుకు ఒక్కటి కూడా కనపడవు..
మూస పోసిన సినిమాలు.. ఒక హీరో, ఒకరు లేదా ఇద్దరు నాయికలు .. ఒక పెద్ద విలను..
ఉన్నట్టుండి  పదులు,  వందలో సంఖ్యలో సుమోలు,  స్కార్పియోలు ..
తరువాత  ఏముంది ....
రక్తం... రక్తం....రక్తం... అంతే.. ఇప్పడి సినిమా...
ఒక సందేశం లేదు .. సందేశాత్మక పాటలు లేవు ....
ఇలా ఎందుకు అని అడుగుతే ..
ఇలాంటివే ప్రజలు ఆదరిస్తున్నారు   కావున .. ఇలానే తీస్తున్నాం  అని కొంతమంది  సినిమా  పెద్దల వాదన..
నాకు ఇప్పడికీ గుర్తు.. "ఆ నలుగురు" అనే సినిమాని ఎంత బాగా ఆదరిచారో.. మన తెలుగు ప్రజలు.. ఇలాంటి ఉదాహరణలు.. అలా చెప్పే వారికి గుర్తు రావడం లేదు..
గమనిస్తుంటే ...నిదానంగా...
అన్ని రంగాలలో.. విలువలు అడుగంటుతున్నాయి..

తెలియచెప్పే వారు లేరు..
తెలియచెప్పే వారికి.. ప్రోత్సాహకాలు లేవు..
జవజీవాలు ఉడిగి....
అంతరిస్తున్న తెలుగు భాషకు.. తులసి తీర్థం పోయడానికి..
మళ్ళీ ఎప్పుడు ఉద్భావస్తాడో... మరొక.. శ్రీ శ్రీ.. 
మళ్ళీ ఎప్పుడు ఉద్భావిస్తాడో.. మరొక సినారె అంటే  Dr .సి.నారాయణ రెడ్డి..
మళ్ళీ ఎప్పుడు చూస్తామో.. తెలుగు భాషలో మంచి సాహిత్యం..
మళ్ళీ ఎప్పుడు  జరుగుతుందో .. పత్రికా  రంగం రాజకీయాల పక్షం నుంచి.. ప్రజల పక్షానికి మారడం ...
ఇవి ఏవీ తెలియని.. నా మనస్సుకు..
ఈ అద్భుతాలు   కాని  అద్భుతాలు  మళ్ళీ  మళ్ళీ  జరగాలని.. ఆ భగవతుని  ప్రార్థిస్తున్నాను..

Sunday, February 27, 2011

ఎవడబ్బ సొమ్మని

ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా
అనే పాట ఇప్పుడు ... అందరు పాడుకునే సమయం వచ్చింది..

మొదట... కోట్ల తో మొదలు అయిన అవినీతి
తరువాత పదులు, వందల కోట్లకు పెరిగి..
అక్కడితో ఆశ తీరక,  ఆనందము  చాలక
అది కాస్తా..... వేల కోట్లకు పాకింది..
అది కాస్త ఊహించని రీతిలో పెరిగి పెద్దవయి.. మనకు

లక్షల కోట్ల  విలువ  చేసే   అవినీతి కుంభకోణాల రూపంలో వెలుగు చూస్తున్నాయి ..
ఈ కుంభకోణాలు దేశ భావిష్యత్హు, దేశ ప్రతిస్తకు సంబంధించిన విషయాలకు సంభందించిన స్కాములు ఇవి.. 

మనందరికీ  తెలుసు .. ఈ దోచిన డబ్బులు ఎక్కడికి వెల్తున్నాయో ... 

ఎవరెవరికి చేరు తున్నాయో..
అవి  పెట్టుబడుల రూపంలో మన దేశంలోకి ఎలా వస్తున్నాయో..
ఆ వేలు మరియు లక్షల కోట్లతో వాళ్ళు ఏమి చేస్తున్నారో..

ఇన్ని జరుతున్న కాని 
విదేశీ బ్యాంకుల్లో వేల , లక్షల కోట్ల అవినీతి డబ్బు దాగుందని తెలిసినా.. 
మన దేశ ప్రజలది అంటే మనందరిదీ ఏమీ చేయలేని దయనీయ పరిస్థితి...


మనం చదువుకున్న పుస్తకాలలో..

లేదా సినిమాలలో.. కామన్ డైలాగ్ ఏంటంటే ...
"అవినీతిఫై  శంఖం పూరించడం"..
.
అప్పట్లో.. 

శంఖం ద్వార వచ్చే శబ్ద  పరిధిలో మాత్రమే అవినీతి వుండేదేమో అని.. కవి అర్థం కాబోలు..
అందుకు ఈ వాక్యాన్ని, తరచుగా కవులు వాడేవారేమో..
ఇప్పుడూ.. అవినీతి హద్దులు ఎల్లలు హద్దులు దాటి .. 

వందలు, వేలు, లక్షల  శంఖాలు  పూరిస్తే  కూడా ఆ శభ్ధం చేరలేనంత  హద్దులు ఈ అవినీతికి పెరిగాయి..

ఇప్పుడూ మనం మహాత్ముడు చెప్పిన ఒక సూక్తి గుర్తు చేసుకోవాలి..
 "“Earth provides enough to satisfy every man's need, but not ONE man's greed”"
ప్రతి మనిషికి సంతోషంగా ఉండడానికి కావాల్సిన వనరులున్నీ ఈ భూమాత దగ్గర వున్నాయి.. కాని ఒక్క  మనిషి అత్యాశకు సరిపోయినన్ని వనరులు లేవు    అని..
ఆయన్న చెప్పిన మాటల్లోని భావం అర్థం చేసుకుంటే మనకు అర్థమయిపోతుంది.. ఎందుకు అమెరికా ఇరాక్ ఫై యుద్ధం చేసిందో...  మనిషి అవినీతిఫై అవినీతి ఎందుకు చేస్తున్నాడో..

ఈ అవినీతికి వున్న పెద్ద జాడ్యం ..
ఆ అవినీతిని.. ఇంకొంచం పెంచడం..
ఎలాగంటే ఒక అవినీతిపరుడు.. కొన్ని వేల కోట్లని దోచి... ఆ వేలకోట్లనుంచి.. ఇంకొన్ని కోట్లను సంపాదించే ఉద్దేశ్యంతో..
ఇంకా ఎంతోమందిని అవినీతి పరుల్ని తయారు చేస్తుంటాడు...
మనం గమనిస్తే...
ఒక అవినీతి పరుని దగ్గర పని చేసే వాళ్ళలో .. తొంబై శాతం మంది.. అవినీతి పరులే వుంటారు...
అది అవినీతికి వున్నా మహా  శక్తి..

అంతేకాకుండా...


ఈ అవినీతికి నీతిని బలహీనపరిచే శక్తి వుంది... అందుకే మనం నీతిగా వెళ్తే పనులు జరగవు అని మన మనసుకి సర్ది చెప్పుకుంటుంటాము
అందుకేనేమో  ..
మనమెప్పుడు.. అవినీతిపరులకే పెద్ద ఫాన్స్..
రైట్ హాండ్స్ .. లెఫ్ట్ హాండ్స్..
దగ్గర బంధువులం..
ఇంకా చెప్పాలంటే.. ఆత్మ బంధువులం..
ఎలా గంటె...  ఉదాహరణకు ...
ఒక రైతు  ఉన్న  ఊరిలోనే... కొంతమంది..రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు... పంట డబ్బు కొరకో ... కరువుభత్యం చిక్కకో... ఆ రైతుకు...సాటి రైతు చనిపోయాడని బాధ పెద్దగ వుండదేమో... ఎందుకంటే దానికి కారణమైన నాయకునికే   వోటు  వేస్తాడు... ఎందుకు... ఆ అవినీతిపరునికి... ఆత్మ బంధువు కావట్టి..
అలాగే  పక్క వూరిలో..రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు .. ఇప్పుడు.. ఈ నాయకుడు.. ఆ వూరి నాయకుణ్ణి.. నిందిస్తాడు.. ఇప్పుడు.. ఇక్కడి వ్యక్తికి 
... అభిమానం పొంగి వచ్చి.. తన వూరి నాయకుణ్ణి  నెత్తిన పెట్టుకుంటాడు...

ఇలాంటి సంఘటనలు ... ఒక్క రైతుల విషయంలోనే కాదు..
అన్నీ వర్గాలు, కులాలు, కార్మికుల విషయంలో జరుగుతున్నాయి..

లేకపోతే .. ఇటువంటి మోసాలు చేసిన నాయకులెందరో మల్లీ మల్లీ ఎందుకు ఎన్నికవుతున్నారు

ఒక్కటి మాత్రం నిజం..
ఈ అవినీతి కట్టె  కాస్త ఇప్పుడూ పెద్ద అడవి అయి  కూర్చుని వుంది..
ఈ అడవిని కాల్చాలంటే.. చిన్న నిప్పు చాలదు.. ఒక కార్చిచ్చు కావలసిందే..
ఎంతటి కార్చిచ్చు కావాలంటే..
మనము అనుకుంటున్న  మూడు కోట్ల మంది దేవుళ్ళు  సమిష్టిగ కలిసి  సృష్టించగలిగే కార్చిచ్చు..



అంతటి కార్చిచ్చు ఎప్పుడు వస్తుందో...
ఎలా వస్తుందో 
నాకు అయితే తెలీదు...
నాకు తెలిసింది వొక్కటే...
అలాంటి కార్చిచ్చు కోసం వేచి చూడడం.. 
దాని కోసం  ముక్కోటి దేవుళ్ళని మనసార ప్రార్థించడం.,

Saturday, October 2, 2010

అయోధ్య తీర్పుపై ఒక భారతీయుడి భావస్పందనగా మహాత్ముని జయంతికి నా నివాళి



నా జన్మ భూమి
ఎంత అందమైన దేశమో...
అనే పాట ఉషారుగా పాడాలనిపిస్తోంది... 

నేను సగటు భారతీయుడిని కాదు ..
నేను పరిపక్వత చెందిన  భారతీయుడిని   అని చెప్పు కునే సమయము మరియు సందర్భము  ఇది ...
దేశము   కంటే   మతము గొప్పది కాదు అని ప్రతి భారతీయుడి కోరికే  అని  అనిపించిన సందర్భము  ఇది...
ఒక హిందువుని అయి ముస్లిములు చల్లగా వుండాలని  ప్రార్థించి ... ఒక ముస్లిమును అయి హిందువులు చల్లగా వుండాలని ప్రార్థించిన సందర్భము  ఇది...
 ఈ అంతరం మనిషి సృష్టించుకున్నదే  కాని, మనిషి కోసం సృష్టించబడినది కాదని...
ఈ మతం అనేది... ఒక సిద్ధాంతం మీద వున్న నమ్మకం మరియు జీవన సిద్హాంతం  మాత్రమే కాని.. ఇతర నమ్మకాలూ మరియు ఇతర సిద్ధాంతాల మీద  వ్యతిరేక పోరాటం చెయ్యమని చెప్పే మతం ఈ భూ ప్రపంచంలో లేదని...అవగాహన చేసుకున్న సందర్భం ఇది...   
ఈ మతం  మనిషిలో వున్న మనసును విషపూరితం చేసేంత చెడ్డ వస్తువు కాదు అని... ఆత్మ నిర్దేశం చేసుకున్న సమయం ఇది... 
మతము కంటే ఆత్మ గొప్పదని ప్రార్థించిన సందర్భము ఇది... 
మన మద్య  వున్న అంతరం నిజంగా మన మధ్య లేదని.. అది ఇతర అవకాశవాదులచే సృష్టింపబడిన అంతరము అని... కనుక్కున్న  సందర్భము ఇది.. 
రాముడు అయినా  అల్లా అయినా శాంతినే కోరుకుంటారని... సర్దుకు పోవడంలో కూడా సంతోషం దాగి వుందని మత పెద్దలు భోధించిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

మహాత్ముడు పుట్టిన రోజు బహుమతిగా ... మన వంతుగా.. ఆ శాంతి ప్రియునికి బహుమతి అందించిన సమయము ఇది.. 
ఏ మూలో నా మనసులో శంక వున్నా,..ఏదో జరుగుతుంది  అని మరుసటి రోజులకి  కావలసిన కూరగాయలు, పాలు సమకూర్చుకున్నా... ముందు రోజు ఆఫీసు నుండి ఆదుర్దాగా తొందరగా అమ్మయ్య అని ఇల్లు చేరినా...
ఆ  మరుసటి రోజు ఆదుర్దాగా పేపర్ చూసినా... అందులో వార్తలు బలపరుచుకోవడానికి టి వి చూసినా.... 
నా మనసులో వున్న శంఖ అది వున్న మూల  కంటే.. ఇంకా  మూలలోకి  వెళ్ళాలని స్పురించిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత  చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

గాంధీ పుట్టిన   దేశమే ఇది... నెహ్రు పెరిగిన సంఘమే ఇది.. అని... జబ్బలు చరుచు కుంటూ... పొలి కేక పెట్టిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత  చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారం 
ఈశ్వర్  అల్లా తేరో నామ్
సబ్కో  సన్మతి  దే  భగవాన్..

జై భారత్... జై గాంధీ... 
ఓం శాంతి శాంతి శాంతిహి