Monday, July 9, 2018

ఓ .. భారతమా .. తస్మాత్ జాగ్రత్త.. జాగ్రత్త

తెర నిండా నటిస్తూ..  
దేశంలోని చెడును మాత్రమే ఉదహరిస్తూ.. 
తానేదో.. దేశాన్ని.. ఉద్ధరించాలని.. తపన చూపిస్తూ.. 
మాట్లాడుతున్న ... టీవీ.. వ్యాఖ్యాతలను  చూస్తూ.. 
భ్రమలో .. మురిసిపోతున్న..   నా.. భారతమా మేలుకో.. 

అది అంతా ఒక నాటకమని.. 
ప్రతి తెర మీద నాటకాన్ని.. ఒక  తెర వెనుక వ్యక్తి..  నడిపిస్తున్నాడని .. 
అదంతా ఒక భూటకమనీ తెలుసుకోలేని 
ఓ భారతమా మేలుకో. 

రైతులే.. ముద్దు అంటూ.. 
రైతు..రాజ్యమే మా కల అంటూ.. 
ప్రజల వెంట తిరుగుతూ.. 

మన కులమే మేలంటూ.. 
మన మతమే మేలంటూ.. 
మనమొస్తే మేలంటూ 
మన వారి వెంటే నడవాలంటూ 
తెర వెనుక విజ్ఞాపిస్తున్న .. 
నాయకుల వెనుకల  తిరుగుతున్న.. ఓ .. భారతమా మేలుకో.. 

మా వాడు.. మన వాడు అంటూ.. 
మా వాడొస్తే .. మేలు చేస్తాడనీ .. 
మా ఇంటోడు వస్తే .. మేలు చేస్థాడనీ 
మా కులపోడే  వస్తే.. మేలు చేస్తాడనీ.. 
మా మతమోడే .. వస్తే.మేలు చేస్తాడనీ.. 
భ్రమలో బ్రతుకుతున్న భారతమా మేలుకో.. 

మేలు చేసే నాయకుడు.. 
మనవాడు కాకపోయినా చేస్తాడు అనే నిజాన్ని  
మన భారతం ..  అటువంటి నాయకులను .. కోకొల్లలుగా . చూసిందని 
తెలిసి..కూడా.. 
ఇటువంటి వారితో .. మోసపోతున్న.. 
ఓ...  నా..  భారతమా..  మేలుకో.. 

వందల ఏళ్ళ చరిత్ర మోసం చేసిందని ..చూపిస్తూ.. 
ఆ మోసం యొక్క ఫలితాన్ని తను మాత్రమే అనుభవిస్తూ 
తనతో వున్న వాళ్ళకి.. 
తనను నమ్మిన వాళ్ళకి.. మాత్రం.. 
ఆవేశాన్ని.. మరియు.. చరిత్ర చేసిన మోసాన్ని.. చూపిస్తూ.. 
తన వాళ్లనే మోసం చేస్తూ.. 
తనను నమ్మిన  వారినే.. తొక్కి పడేస్తూ.. 
తనకు నచ్చిన వాళ్ళతో.. రాజ్యాన్ని విస్తరిస్తూ.. 
తానేదో.. త్యాగం చేస్తున్నాడని చూపిస్తూ.. 
తన జీవితం.. వారికే అంకితం అని.. నమ్మిస్తూ.. 
అదే నిజమని .. 
తమ నాయకుడు.. దేవుడు ఇచ్చిన వరం అని.. 
భ్రమలో బ్రతికేస్తున్న .. 
ఓ.. నా..  భారతమా మేలుకో .. 


మనం  చదవని.. మనకు  తెలియని చరిత్రని సృష్టిస్తూ .
మనం చదివినది ..  ..తప్పు అని నమ్మిస్తూ.. 
అప్పుడేదో  అన్యాయం  జరిగిందని .. 
ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేరేపిస్తూ .. 
ఆ అందరి ఆవేశం మధ్యలో.. తన యొక్క విజయ పరంపరను సాగిస్తూ.. 
తనకు మాత్రం అద్భుత ఆకాశ హర్మ్యాన్ని  నిర్మించుకుంటూ.. 
నమ్మిన వాళ్ళకి మాత్రం.. ఆ ఆకాశ హర్మ్య    నీడని చూపిస్తూ.. 
వాళ్ళు కట్టిన దాంట్లో విలాసంగా ఉంటూ.. 
వాళ్ళు వేసిన మంటల్లో...  చలి కాల్చు కుంటూ.. 
ఆ మంటల .  అలజడిలో  తెలియక పడి  మాడి  మసి  అవుతున్న
ఓ .. నా.. భారతమా .. మేలుకో 


జగమంటే .. మనమని.. 
మనమంటే.. జగమని.. 
జగత్హు అంత.. భారతాన్ని.. నింపిన.. 
మన చరిత్ర అమరులారా. 
రండి.. మీరు  నిర్మించిన .... భారతం.. భ్రమలో.. కొట్టు మిట్టాడుతోంది.. 
వచ్చి.. మన .. భారతాన్ని.. మేలు కొలపండి..