ఏమి జరుగుతోంది ఇక్కడ..
నాకు తెలియాలి..నాకు తెలియాలి..నాకు తెలియాలి..
వారం క్రితం వరకు.. కెసిఆర్ కనపడక పోయేసరికి . ఇది చాల మంది ప్రజలు అడిగిన ప్రశ్న..
నేను అనుకున్నాను.. ఆయన మారాడు.. ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి.. ఆలోచిస్తున్నాడు అని..
నేను అనుకున్నాను.. ఆయన రాజ్యాంగ పదవి అయిన ముఖ్య మంత్రి పదవి యొక్క పద్ధతి.. విలువలు.. తెలుసుకుని మసలుకొంటున్నాడు అని ..
నేను అనుకున్నాను... ఆయన రైతుల ఇబ్బందుల గురించి. ఆలోచిస్తున్నాడు అని ..
నేను అనుకున్నాను.. అసలే తీవ్ర విద్యుత్ సంక్షోభం లో వున్న తెలంగాణా రాష్ట్రాన్ని.. సంక్షోభంలోంచి బయటకు ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నాడు అని ..
నేను అనుకున్నాను.. ఆయన హైదరాబాద్ పరిశ్రమలకు.. పవర్ హాలిడే తగ్గించి.. శ్రామిక లోకాన్ని.. కార్మిక లోకాన్ని.. పరిశ్రమ లోకాన్ని.. సంక్షోభం లోంచి.. బయటకు ఎలా తేవాలా అని.. ఆలోచిస్తున్నాడు అని ..
నేను అనుకున్నాను.. ఆయన.. ప్రజల మధ్య.. విభజన రాజకీయాలు మానేసాడు అని ..
చెప్పలేక పోతున్నాను కాని.. నవ్వోస్తున్నా చెప్పేస్తున్నా...
ప్రతి చేత కాని పనికీ.. చంద్ర బాబుని.. అటుపక్క ప్రభుత్వం మీద దుమ్ము వేయడం ఆపు చేస్తాడని అని ..
పాటకులకు బోరు కోతుందేమో అని.. ఇలా ఎన్నో అన్నుకున్నవన్నీ చెప్పలేక పోతున్న..
ఇన్ని మంచి విషయాలు అనుకున్న నా అన్ని ఆలోచనలు ఫట్టాపంచలు అయ్యాయి ..
మొన్న జరిగిన కెసిఆర్ ప్రెస్ మీట్ చూసిన తరువాత .. నేను అనుకున్నవన్నీ.. కల్లలే అని అర్థం అయింది..
పైన నేను చెప్పిన వాణ్ణి.. కల్లలే అని కెసిఆర్ గారి ప్రెస్ మీట్ ..విన్న ప్రతి వోక్కరికీ అర్థమయ్యి వుంటుంది..
దురదృష్టవశాత్తు మన దేశంలో .. నీళ్ళ కోసం కొట్టుకోని .. కోర్టుకు ఎక్కని.. రాష్ట్రాలు లేవంటే.. నమ్మాలి..
కాని మనం గమనించాల్సింది ఏమిటంటే.. ప్రతి ముఖ్యమంత్రి/రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పరంగా వెళ్లి సాధించుకోవాలి అనుకున్నారు కాని.. పక్క ముఖ్యమంత్రుల్ని దుమ్మెత్తి పోయలేదు..కాని మన కెసిఆర్ గారు అది చేస్తున్నారు..
తిట్టడం వాల్లన్దిరికీ చేత కాక కాదు..
ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే..
అందరికీ నోరుంటుంది.. అందరికీ ఏదో ఒక భాష ఉంటుది.. అన్ని భాషల్లో తిట్లు వుంటాయి.. అందరికీ KCR లా కాకపోయినా.. ఏదో ఒక తిట్లు తెలిసి వుంటాయి.. ఉపయోగించడం తెలిసి వుంటుంది..
కాని వాళ్ళందరూ విజ్ఞులు.. కావున.. వాళ్ళు తిట్ల విధానాన్ని ఉపయోగించరు .. అంతే..
ఉదాహరణకు ఈమధ్య కాలం లో.. తమిళనాడు ముఖ్యమంత్రి కారాగారం పాలయినప్పుడు.. ఆమె.. ప్రజలకు శాంతి సందేశం పంపారు.. అది విజ్ఞత..
భారత దేశం అహింసా విధానానికి పెట్టింది పేరు..
మహాత్ముడు.. పాటించిన ఈ విధానం ప్రపంచ ఉద్యమ విధాన్నాన్ని మార్చింది..అంటే అతిశయోక్తి కాదు..
అందుకే ఈ మధ్య కాలంలో.. ప్రపంచంలో.. నిరసనని తెలుపడానికి.. ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు..
అలాంటి దేశంలో.. పుట్టి.. ఆయన పద్దతిని.. కొంచెం కూడా పాటించకుండా..
ముఖ్య మంత్రి అయిన తరువాత కూడా.. కేవలం విప్లవ విధానాన్ని. ఎన్నుకోవడం .. నమ్ముకోవడం.. కెసిఆర్ గారు చేస్తున్న తప్పు అని నా అభిప్రాయం..
అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి
ఒక కొత్త రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారకునికిగా గుర్తించబడ్డ ఇతడే నా ఆ ఈ KCR అని అనిపిస్తోంది.. ఒక నాయకుడు అంటే.. కష్టాల్లో కూడా తనే ముందుండి .. సమస్యలు పరిష్కరించాలి..
మాటలతో కాకుండా చేతలతో.. విమర్శకుల నోళ్ళు మూఇస్తున్న చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి.. HudHud తూఫాన్ సమయంలో ఆయన చూపించిన పరిపక్వత స్వంత రాష్ట్ర ప్రజల మనసులె కాకుండా.. ఇతర రాష్ట్రాల వారి మనసులు కూడా దోచుకున్నారు..
కాని.. చాల మంది.. గమనించాల్సింది.. ఒకటి వుంది..
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత.. సామాజిక అనుసంధాన వేదిక..అదేనండి.. సోషల్ నెట్వర్కింగ్ లో .. ప్రజల విద్వేషాలను గమనిస్తే.. భారత్ vs పాకిస్తాన్ గుర్తుకు వస్తుండేది.. అంత విద్వేషం కనపడేది.. Facebook పోస్ట్స్ మరియు కామెంట్స్ లో..
మనం గమనిస్తే .. ఒకప్పుడు.. వినడానికి.. చెప్పడానికి..పలకడానికి..సిగ్గు పడే పదాలు.. ఈ అనుసంధాన వేదికలలో.. ఎన్నో ఉండేవి.. ఇది నా మనసుకు బాగా బాధించిన విశయం ..
ఈ మధ్య కాలంలో.. గమనించింది .. ఏమిటంటే.. విద్వేషాలు బాగా తగ్గిపోయాయి..
ఇప్పుడు.. పరస్పర విమర్శలు మాత్రమె వస్తున్నాయి..
ఎందుకంటే.. విద్వేషం అనేది.. మండే మంట లాంటిది.. అందులో.. రేచ్చకోట్టుకోవడం అనే నూనెను ఆపేస్తే.. మంట అదంటకదే చల్లారుతుంది..
ఈ మధ్య.. రెచ్చకొట్టుకోవడం తగ్గి.. విద్వేషం అనే మంట.. తగ్గుతోంది..
ఇది.. ప్రజలలో వస్తున్న మార్పు..
మా పల్లెలో.. ఒక రైతు ఆత్మహత్య చీసుకుంటే.. అందుకు.. పక్క రాష్ట్ర ముఖ్య మంత్రిని. బూచిగా చూపిస్తే.. ఎవరి మనన్సైన.. ఎన్ని రోజులు ఊరుకుంటుంది.. చెప్పండి..
ఇప్పటికైనా.. ప్రజల గురించి ఆలోచించడం మొదలు పెట్టి..
కలసి వుంటే కలదు సుఖం అని..
పర నింద.. ఆత్మ స్తుతి మంచిది కాదని గమనించాలని..
ఒక రాష్ట్రము అన్నాక... పొరుగు రాష్ట్రాలతో అభిప్రాయ బేదాలు సహజమని.. గుర్తిస్తూ..
ఎవరి రాష్ట్రానికి .. వారి రాష్ట్ర ప్రజల సౌఖ్యం ముఖ్యం అనేది గమనిస్తూ..
పక్క రాష్ట్రాలపై నిందలు వేయడం వల్ల .. మనకు తెలియకుండా.. మన చేతకానితనాన్ని ప్రపంచానికి చెప్తున్నట్టు గమనించాలి..
తొడ కొట్టడాలు.. చాలెంజ్ చేయడాలు .. సినిమాల్లో బాగుంటాయేమో కాని.. ప్రభుత్వ పాలనలో హర్షించరనీ ..
చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కాని.. బహిరంగ చర్చల ద్వారా.. కాదని తెలుసుకోవాలని .. అకాంక్షిస్తూ .. ప్రార్థిస్తున్నాను