Saturday, October 2, 2010

అయోధ్య తీర్పుపై ఒక భారతీయుడి భావస్పందనగా మహాత్ముని జయంతికి నా నివాళి



నా జన్మ భూమి
ఎంత అందమైన దేశమో...
అనే పాట ఉషారుగా పాడాలనిపిస్తోంది... 

నేను సగటు భారతీయుడిని కాదు ..
నేను పరిపక్వత చెందిన  భారతీయుడిని   అని చెప్పు కునే సమయము మరియు సందర్భము  ఇది ...
దేశము   కంటే   మతము గొప్పది కాదు అని ప్రతి భారతీయుడి కోరికే  అని  అనిపించిన సందర్భము  ఇది...
ఒక హిందువుని అయి ముస్లిములు చల్లగా వుండాలని  ప్రార్థించి ... ఒక ముస్లిమును అయి హిందువులు చల్లగా వుండాలని ప్రార్థించిన సందర్భము  ఇది...
 ఈ అంతరం మనిషి సృష్టించుకున్నదే  కాని, మనిషి కోసం సృష్టించబడినది కాదని...
ఈ మతం అనేది... ఒక సిద్ధాంతం మీద వున్న నమ్మకం మరియు జీవన సిద్హాంతం  మాత్రమే కాని.. ఇతర నమ్మకాలూ మరియు ఇతర సిద్ధాంతాల మీద  వ్యతిరేక పోరాటం చెయ్యమని చెప్పే మతం ఈ భూ ప్రపంచంలో లేదని...అవగాహన చేసుకున్న సందర్భం ఇది...   
ఈ మతం  మనిషిలో వున్న మనసును విషపూరితం చేసేంత చెడ్డ వస్తువు కాదు అని... ఆత్మ నిర్దేశం చేసుకున్న సమయం ఇది... 
మతము కంటే ఆత్మ గొప్పదని ప్రార్థించిన సందర్భము ఇది... 
మన మద్య  వున్న అంతరం నిజంగా మన మధ్య లేదని.. అది ఇతర అవకాశవాదులచే సృష్టింపబడిన అంతరము అని... కనుక్కున్న  సందర్భము ఇది.. 
రాముడు అయినా  అల్లా అయినా శాంతినే కోరుకుంటారని... సర్దుకు పోవడంలో కూడా సంతోషం దాగి వుందని మత పెద్దలు భోధించిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

మహాత్ముడు పుట్టిన రోజు బహుమతిగా ... మన వంతుగా.. ఆ శాంతి ప్రియునికి బహుమతి అందించిన సమయము ఇది.. 
ఏ మూలో నా మనసులో శంక వున్నా,..ఏదో జరుగుతుంది  అని మరుసటి రోజులకి  కావలసిన కూరగాయలు, పాలు సమకూర్చుకున్నా... ముందు రోజు ఆఫీసు నుండి ఆదుర్దాగా తొందరగా అమ్మయ్య అని ఇల్లు చేరినా...
ఆ  మరుసటి రోజు ఆదుర్దాగా పేపర్ చూసినా... అందులో వార్తలు బలపరుచుకోవడానికి టి వి చూసినా.... 
నా మనసులో వున్న శంఖ అది వున్న మూల  కంటే.. ఇంకా  మూలలోకి  వెళ్ళాలని స్పురించిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత  చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

గాంధీ పుట్టిన   దేశమే ఇది... నెహ్రు పెరిగిన సంఘమే ఇది.. అని... జబ్బలు చరుచు కుంటూ... పొలి కేక పెట్టిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత  చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారం 
ఈశ్వర్  అల్లా తేరో నామ్
సబ్కో  సన్మతి  దే  భగవాన్..

జై భారత్... జై గాంధీ... 
ఓం శాంతి శాంతి శాంతిహి