Saturday, October 2, 2010

అయోధ్య తీర్పుపై ఒక భారతీయుడి భావస్పందనగా మహాత్ముని జయంతికి నా నివాళి



నా జన్మ భూమి
ఎంత అందమైన దేశమో...
అనే పాట ఉషారుగా పాడాలనిపిస్తోంది... 

నేను సగటు భారతీయుడిని కాదు ..
నేను పరిపక్వత చెందిన  భారతీయుడిని   అని చెప్పు కునే సమయము మరియు సందర్భము  ఇది ...
దేశము   కంటే   మతము గొప్పది కాదు అని ప్రతి భారతీయుడి కోరికే  అని  అనిపించిన సందర్భము  ఇది...
ఒక హిందువుని అయి ముస్లిములు చల్లగా వుండాలని  ప్రార్థించి ... ఒక ముస్లిమును అయి హిందువులు చల్లగా వుండాలని ప్రార్థించిన సందర్భము  ఇది...
 ఈ అంతరం మనిషి సృష్టించుకున్నదే  కాని, మనిషి కోసం సృష్టించబడినది కాదని...
ఈ మతం అనేది... ఒక సిద్ధాంతం మీద వున్న నమ్మకం మరియు జీవన సిద్హాంతం  మాత్రమే కాని.. ఇతర నమ్మకాలూ మరియు ఇతర సిద్ధాంతాల మీద  వ్యతిరేక పోరాటం చెయ్యమని చెప్పే మతం ఈ భూ ప్రపంచంలో లేదని...అవగాహన చేసుకున్న సందర్భం ఇది...   
ఈ మతం  మనిషిలో వున్న మనసును విషపూరితం చేసేంత చెడ్డ వస్తువు కాదు అని... ఆత్మ నిర్దేశం చేసుకున్న సమయం ఇది... 
మతము కంటే ఆత్మ గొప్పదని ప్రార్థించిన సందర్భము ఇది... 
మన మద్య  వున్న అంతరం నిజంగా మన మధ్య లేదని.. అది ఇతర అవకాశవాదులచే సృష్టింపబడిన అంతరము అని... కనుక్కున్న  సందర్భము ఇది.. 
రాముడు అయినా  అల్లా అయినా శాంతినే కోరుకుంటారని... సర్దుకు పోవడంలో కూడా సంతోషం దాగి వుందని మత పెద్దలు భోధించిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

మహాత్ముడు పుట్టిన రోజు బహుమతిగా ... మన వంతుగా.. ఆ శాంతి ప్రియునికి బహుమతి అందించిన సమయము ఇది.. 
ఏ మూలో నా మనసులో శంక వున్నా,..ఏదో జరుగుతుంది  అని మరుసటి రోజులకి  కావలసిన కూరగాయలు, పాలు సమకూర్చుకున్నా... ముందు రోజు ఆఫీసు నుండి ఆదుర్దాగా తొందరగా అమ్మయ్య అని ఇల్లు చేరినా...
ఆ  మరుసటి రోజు ఆదుర్దాగా పేపర్ చూసినా... అందులో వార్తలు బలపరుచుకోవడానికి టి వి చూసినా.... 
నా మనసులో వున్న శంఖ అది వున్న మూల  కంటే.. ఇంకా  మూలలోకి  వెళ్ళాలని స్పురించిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత  చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

గాంధీ పుట్టిన   దేశమే ఇది... నెహ్రు పెరిగిన సంఘమే ఇది.. అని... జబ్బలు చరుచు కుంటూ... పొలి కేక పెట్టిన సందర్భము ఇది.. 
నేను పరిపక్వత  చెందిన భారతీయుడిని అని స్పురించిన సందర్భము ఇది..

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారం 
ఈశ్వర్  అల్లా తేరో నామ్
సబ్కో  సన్మతి  దే  భగవాన్..

జై భారత్... జై గాంధీ... 
ఓం శాంతి శాంతి శాంతిహి 

Saturday, September 25, 2010

oka manchi paata ..mee kosam (dubbing :)

మా బాబుకు అద్వైత్ అని పేరు పెట్టాము.. మా బాబు కోసం ఏదో ఒకటి రాయాలని అనిపించిది..  ఈ పదం గురించి వెతుకుతున్న ఆ క్రమంలో.... నాకు ఈ పాత పాట  దొరికింది.. ఈ పాట నా మనసును హత్తుకోవడమే కాకుండా ఆలోచింపచేసింది... అందుకే నా మిత్రుల కోసం నేను సాధ్యమయినంతవరకు తెలుగులో అర్థం రాసాను... మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను... ఇక అంతా ఈశ్వరేచ్చ .. ఇక కింద 
వున్న కే.జే.ఏసుదాసు పాడిన పాట వింటూ కింద వున్న అర్థం చదవండి..  ధన్యవాదాలు 

AND

On the occasion of Ayodhya Verdict, let my all country men understands that Country comes first than the Religion.. praying for the same


Language: Malayalam
Movie/Album Name :LINE BUS 
Singer Name :K.J YESUDAS
Year of Release : 1971






Adhwaitham janicha naattil  => అద్వైతం పుట్టిన భూమి 
Aadhi shankaran janicha naattil  => ఆది శంకరుడు పుట్టిన భూమి  
Aayiram jaathikal aayiram mathangal  => ఇప్పుడు వేల కులాలు ,  వేల మతాలు 
Aayiram dhaivangal => వేల దేవుళ్ళు 
Adhwaitham janicha naattil  => అద్వైతం పుట్టిన భూమి 
Mathangal janikkum mathangal marikkum  => మతాలు ఉద్భవిస్తాయి,మతాలు మరణిస్తాయి 
Manushyanonne vazhiyullu => కాని మానవునికి ఒకే మార్గం వుంది  
Nithya sneham thelikkunna veedhi => నిత్యం  ప్రేమతో నిండిన మార్గం 
Sathyonnyeshana veedhi 





=> సత్యాన్వేషణ మార్గం 
Nithya sneham thelikkunna veedhi => 








నిత్యం  ప్రేమతో నిండిన మార్గం 
Sathyonnyeshana veedhi






 





=> సత్యాన్వేషణ మార్గం



 
Yugangal raktham chinthiya veedhi























=> యుగయుగాలు రక్తం చిందిన మార్గం 
Adhwaitham janicha naattil => అద్వైతం పుట్టిన భూమి Prapancham muzhuvan velicham nalkaan



 => ప్రపంచం మొత్తానికి వెలుగు ఇవ్వడానికి 
Pakalinonne vilakkullu



 => పగలు మాత్రమే వుంది, ఈ పగలుకు కారణం ఒక్క సూర్యుడే 
Laksham nakshathra dheepangal koluthi



 => లక్షల నక్షత్ర దీపాలున్న రాత్రి 
Swapnam kaanunnu raathri (laksham)



 => స్వప్నాలను మాత్రమే కంటోంది 
Velicham swapnam kaanunnu raathri



 => ఆ స్వప్నం  లోనే రాత్రి వెలుతురును చూడగలుతోంది
Adhwaitham janicha naattil => అద్వైతం పుట్టిన దేశం Aadhi shankaran janicha naattil => ఆది శంకరుడు పుట్టిన దేశం Aayiram jaathikal aayiram mathangal => వేల జాతులు వేల మతాలు
Aayiram dhaivangal => వేల దేవుళ్ళు
Adhwaitham janicha naattil => అద్వైతం పుట్టిన దేశం 

=============
SUMMARY OF THE SONG

The place where Adwaitham and Aadishankara were born is now polluted by thousands of religions, castes and gods. Amid the tumultuous environment, man has only one way to get relief. And it is the way of eternal love; something seeked by all. There is only one light, which illuminates the universe. The night is dreaming for the arrival of the dawn by the company of numerous stars. This poem inspires value education. It draws out the best side of man. It provides a strong statement: the need to absorb basic spirits. It conveys the truth, the oneness of all religions.

TRANSLATION
Where Adi Sankara was born,
Is torn by a thousand castes……a thousand religions
A thousand Gods.
Religions take birth … religions die out
There remains but one path before man:
The path that eternal love carves out,
The path that leads to truth…the path
On which eons shed their blood.
To light the whole world
The day has but one lamp
The star-studded night lights a thousand lamps
And dreams of night.

Tuesday, January 26, 2010

నా గణ తంత్ర దినోత్సవ ప్రార్థన



ఓ భగవంతుడా  
నాకు నా దేశము గురించి ఆలోచించే ఆలోచనను ఇవ్వు నా 
కన్నా నా దేశము గొప్పది అనుకొనే సంస్కృతిని ఇవ్వు 
నా ప్రజలకు నేను సేవ చేయాలనే కర్తవ్య భోధన ఇవ్వు  
నా ఇంటి ప్రతిష్ట లాగే .. నా దేశ ప్రతిష్ట కూడా గోప్పదనుకునే భుద్దిని ఇవ్వు  

నా పుట్టిన రోజును నా మిత్రులతో.. ఎలా జరుపుకున్తానో... నా పెళ్లి రోజుని నా కుటుంబంతో ఎలా జరుపుకున్తున్ననో..నా గణ తంత్ర దినోత్సవాన్ని నా దేశ బాగు కోసం జరుపుకునే ఆలోచన ఇవ్వు ..  

గణ తంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికీ తేడా తెలుసోవడం నా కనీస ధర్మమూ అని తెలుసుకొనే జ్ఞానం ఇవ్వు.  

రోజు భగవంతున్ని ప్రార్థించి ఈ జీవితం ప్రసాదించినందుకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకుంటానో .. అలాగే ఈ రోజు ఇలా స్వతంత్రంగా గడుపుతున్నదుకు.. కారణమైన స్వతంత్ర సమర యోధులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకునే ఆలోచనను కూడా ఇవ్వు..

రంగు, జాతి, కులము, మతము కంటే మానవత్వము గొప్పది అని ఆలోచన కలిగేలా భావనను ఇవ్వు ..  

సినిమా పోస్టరు చూసి అందులో నటించిన వారి పేరు, వూరు టప టప చెపుతున్న నేను, నా జాతీయ పతాకాన్ని చూసిన వెంటనే అందులో వున్నా రంగుల గురించి, మధ్యలో వున్నా అశోక చక్రము గురించి, అందులో ఎన్ని ఊచలు ఉంటాయో....అదెందుకు అక్కడికి వచ్చిందో కూడా టప టప చెప్పే జ్ఞానము సంపాదించుకునే జ్ఞానం ఇవ్వు .

నా అభిమాన కథ నాయకుడి పేరు , కథానాయకురాలి పేరు, వారి ఇష్ట మైన ప్రదేశం పేరు చెప్పినట్టుగా... నా జాతీయ పక్షి, జాతీయ అట, జాతీయ గీతముల గురించి కూడా చెప్పే జ్ఞానం ఇవ్వు..

నేను గుక్క తిప్పుకోకుండా , స్క్రిప్ట్ చూడకుండా..పాడగల .. ఆ పాటల జాబితాలో నా జాతీయ గీతాన్ని కూడా చేర్చుకునే ఆలోచనని ఇవ్వు..  

నా మనసులో... నా మాతృ స్థానానికి సమానంగా నా దేశ స్థానాన్ని కుదిన్చుకునే స్వభావాన్ని ఇవ్వు.. నా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి... ఒక సీరియల్ ఎపిసోడే టైం సరిపోతుందనే భావనను ఇవ్వు.. కుంటుంబాన్ని ప్రేమించినట్టే , దేశాన్ని కూడా ప్రేమించొచ్చు అనే జ్ఞానం ఇవ్వు..
జాతి, మత, ప్రాంత కోసం కాకుండా దేశము కోసం పోరాడే శక్తిని ఇవ్వు
గాంధీ గారి కలల్ని సాకారం చేసుకునే శక్తిని ఇవ్వు


మీ
వెంకట రత్నం (నివెర)

Wednesday, January 6, 2010

ఒక తెలుగు వాడి ఆత్మ ఘోష

మన అందరికి సుపరిచుతుడు అయిన కే.జే.ఏసుదాసు పాడిన ఒక పాత పాట నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది..


మనుష్యులు..మతాలను సృష్టిస్తే..
మతాలూ దైవాలను సృష్టిశ్తే..
మనుష్యులు , మతాలు మరియు దైవాలు ఈ భూమిని చీల్చి వేశాయి అని
ఈ మూడు వాక్యాలలోని అర్థం , మన మనసుకు హత్తుకునేస్థాయి, ఆలోచింపచేస్తాయి అని అంటే అతిశయోక్తి కాదేమో..
ఈ మూడు వాక్యాలు ఒక రచయిత..ఆవేశం , ఆవేదన మరియు ఆలోచన నుంచి వచ్చాయన్న మాట ముమ్మాటికీ సత్యం..




ఇప్పుడు ఆ చీలిన భూమిని కాస్త మరింత చీల్చాలనే కుట్రను చూసి.. ఎంతో మంది ఆత్మ క్షోభిస్తోంది .. మరి కొంత మందికి శోభనిస్తోంది
ఎందఱో మహానుభావులు రక్తాన్ని చిందించి మన దేశానికి స్వాతంత్ర్యము తెచ్చారు..
మరి ఎందఱో మహానుభావులు.. ప్రాణాల్ని అర్పించి.. మనకు ఒక రాష్ట్రాన్ని సంపాదించి పెట్టారు..
మరి ఇప్పడు కొందరు రాజకీయ కీచకులు.. రాష్ట్రాన్ని తన సొంత లాభం కోసం చీల్చి వేయాలని చూస్తున్నారు..
వారు రగిలించిన చితి మంటల్లో.. అమాయకులు, సామాన్యులు, విద్యార్థులు సమిథలుగా మారుతున్నారు..




ఒక మంచి రాజు వుంటేనే ఒక మంచి రాజ్యం ఏర్పడడం సాధ్యము అవుతుంది..
అందుకే ఇప్పుడూ మనము ఉదాహరణగా రామ రాజ్యము అంటామే కాని... అయోధ్య రాజ్యం అని ఎప్పుడు ఉదాహరణగా వాడము ..
అది ఒక గొప్ప రాజుకు చరిత్ర ఇస్తున్న ప్రాముఖ్యము..
ఇప్పుడు ..ఒక రాజకీయ శకుని ఒక రాష్ట్రాన్ని చీల్చాలని తన సహాయ శక్తుల కృషి చేస్తున్నాడు..
అతని ఆశయము ఉన్నత ఆశయం కావచ్చు.. కాని అతనికి వున్నా అంకితత్వాన్ని ప్రతి ఒక్కరు శంకించ దగ్గ విషయము..




ఎప్పుడో... ఏడు సంవత్సరాల క్రితం రేపే తెలంగాణా అన్నాడు.. తరువాత వారము అన్నాడు.. తరువాత ఇంకా ఎన్నో అన్నాడు..
పిల్లప్పుడు మనము చదువుకున్న బాబోయ్ పులి అన్న కథలో కనీసము అబద్దాల సంఖ్య వుంది..కాని ఈయన చెప్పిన అబద్దాల సంఖ్య మన దగ్గర లేదు.




ఒక్కసారి...అతని ఆశయము కోసము జీవితం పణంగా పెడుతున్నవాళ్ళు...
అతడు.. తన రాజకీయ జీవితంలో..ఇచ్చిన వాగ్ధానాలు ఒక పేపరు మీద రాసుకుని చదివినట్లు అయితే మనకే నిజము అర్థమవుతోంది..
అతడు చేస్తున్న ఈ వికృత చేస్థలు అన్నీ తన రాజకీయ ఉనికి చాటుకోవడానికే అని తెలియడానికి.




ఈ విషయానికి కారకులు రాజకీయ నాయకులే..
కాని సమిధలు మాత్రం.. సామాన్య ప్రజలు ..
ఈ నాయకులు ఇంత సమిష్టిగా ఎప్పుడు అయినా.. ప్రజల విషయము కోసం ఇలా శ్రమించారా...
నేను పుట్టి ఇప్పడికి ముప్పై సంవతరాలు అయింది..
నాకు బుద్హి వచ్చి ఇప్పడికి ఇరవై ఇదు సంవత్సరాలు అయింది..
నాకు ఇటువంటి సంఘటనా ఒక్కటి కూడా కూడా గుర్తులేదు..
చేసినా ఆ విషయము గంట కొట్టినంత సమయము కూడా వుండదు..




మనకు ఇవన్నీ తెలియని విషయాలు కాదు..
మనందరు..రొజూ చర్చించుకునే విషయాలే ఇవి..
మరి మనమెందుకు వారి కుసంస్కార ఆలోచనలకు సమిధలు కావాలి..




ఇప్పుడు ఒక విషయాన్నీ గమనించాలి..
మన నాయకులూ చిత్త శుద్దితో కృషి చేస్తే...ఏది అయిన సాధించగలరు..అన్న మాట సుస్పష్టం.
నూట యాభై సభ్యులు..రాజీనామా ఇస్తే.. విడదీస్తామన్న రాష్ట్రాన్ని.. విడదీయమని చెప్పారు..మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు..
ఇదే నూట యాభై సభులు..రాజీనామా చేస్తామని చెప్తే.. మనకు ఎందుకు కేంద్రం కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయదు..చెప్పండి..
వాళ్ళు చెయ్యరు.. అది అంతే..
ఈ తప్పుల తర్పీదు ఇస్తున్న వారము మనమే కదా








ప్రియమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా... నాది ఒక విన్నపము..
దయ చేసి..మీరు లేదా మీ పిల్లలని ఇందులో సమిధలు కాకుండా చూసుకోండి..
ఈ సారి.. ఎప్పుడు అయినా మీ నాయకుడు ఇంటి దగ్గరకు వస్తే.. మీ గ్రామము లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసము రాజీనామా చేయమని చెప్పండి..
ఒక్కరు కూడా చెయ్యరు.. మరి వారి కుట్రలో మనము ఎందుకు సమిధలు కావాలి..
అని ఈ పోరాటములో పాల్గొన్నవారు, పాల్గొనాలి అని అనుకుంటున్న వారు ఆలోచించాలి




కలిసి వున్నప్పుడు ఏమీ చేయని ఈ నాయకులూ విడిపోయిన తరువాత ఎందుకు చేస్తారు ?
ప్రజా సేవకు ప్రత్యేక రాష్ట్రానికి పొంతన ఏంటి ?
ప్రత్యేక రాష్ట్రం వల్ల దేశములోని ముఖ్య మంత్రుల సంఖ్యా పెరుగుతుంది
మంత్రుల సంఖ్యా పెరుగుతుంది
అంతే కాని ప్రజలకు ఏమి ఒరుగుతుంది?
ఇలా అంటున్నాను అని నేను సమైఖ్య వాదిని కాదు.. ఈ సమైఖ్య వాదన కూడా రాజకీయ నాయకుల స్వార్థమే..
విద్యార్థుల ముసుగులో గుండాలు చేస్తున్న అక్రమాల్ని కనుక్కోవడం విద్యార్థుల విధే




ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలంటే కొన్ని లక్షల కోట్లు అవసరం..
ఎందుకు.. ఆ డబ్బులు అంతా పాలనా వ్యవస్థను స్థాపించడనికే ..
అదే లక్షల కోట్లు రాష్ట్ర భవిష్యత్తుకు ఖర్చు పెట్ట గలిగితే మన రాష్ట్రం తప్పనిసరిగా స్వర్ణ రాష్ట్రం గా మారుతుంది..
లక్షలకొద్దీ ఉద్యోగాలు సృష్టింపబడతాయి




మనకు కావలసినది ప్రత్యేక తెలంగాణానో , ప్రత్యేక ఆంధ్రనో లేక ప్రత్యేక గ్రేటర్ రాయలసీమనో కాదు..
మనకు నిక్కచ్చిగా కావలసినది..
ప్రత్యేక నాయకులు..
డబ్బు కోసం కాకుండా సేవ కోసం గ్రామాలకు బస్సులు నడిపే ఆర్ టి సి బస్సులను కాల్చని , ప్రజల ఆస్తులని ద్వంశం చేయని ప్రత్యేక ఆందోళనకారులు...
మన భవిష్యత్తు నాశనం అవుతున్న.. పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నా , ఉద్యోగాలలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని నాయకుల వెంబడి వుండే విద్యార్థి నాయకులు




చివరికి ఒక చిన్న మాట మీరు ఎప్పుడుయినా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అభి వృద్ధి చెందిన దేశాల పటాలు చూసారా..చూడలేదంటే ఒక సారి పటాలను గమనించండి .. ఆ దేశములలోని రాష్ట్రాల బోర్డర్లు గమనించండి..అంత చెస్ బోఅర్డు లాగ వుంటాయి.. ఈ చీలికలు పాలనా వ్యవస్థను సరళం చేయడానికే కాని .. జటిలం చేయడానికి కాదు..




జై తెలుగు తల్లి..